-నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణ అక్రమ అరెస్ట్ చేయడమంటే విద్యా వ్యవస్థ పై దాడితో సమానం
– ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశ్నా పత్రాలు లీకేజీ విషయంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
– ప్రశ్నా పత్నాలు లీకేజ్ పై జగన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.
– పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని జగన్ రెడ్డి ప్రజలకు మెరుగైన పాలనను ఏ విధంగా అందిస్తారు
– కొండేపి శాసనసభ్యులు డోల బాల వీరాంజనేయ స్వామి
ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంలో నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణను అక్రమ అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోంది. కరోనా తరువాత జగన్ రెడ్డి పాలనలో మొట్ట మొదటి పదవ పరీక్షలను సరిగ్గా నిర్వహించలేక చేతులెత్తేశారు. ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నారాయణను అక్రమ అరెస్ట్ చేశారు. అరెస్ట్ వారెంట్ చూపించకుండా ఏ విధంగా అరెస్ట్ చేశారు?
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశ్నా పత్రాలు లీక్ అయినందుకు విద్యా శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కొడుకు వర్ధంతి కార్యక్రమంలో ఉండగా నారాయణను అరెస్ట్ చేయడం జగన్ రెడ్డి సైకో మనస్థత్వానికి అద్దం పడుతోంది. ‘‘ప్రశ్నా పత్రాలు ఎక్కడా లీక్ అవ్వలేదు. ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయన్న వార్తల్లో వాస్తవం లేదని ఏప్రెల్ 28, 2022న కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటన విడుదల చేసింది.
ఎంతో మంది విద్యార్ధుల భవిష్యత్ కోసం పాటుపడుతున్న నారాయణ అక్రమ అరెస్ట్ చేయడం అంటే విద్యా వ్యవస్థపై జగన్ రెడ్డి దాడి చేయడమే అవుతుంది.ఇప్పటికే విద్యా వ్యవస్థను జగన్ రెడ్డి సర్వనాశనం చేశారు. విద్యా వ్యవస్థ పతానావస్థకు చేరుకున్న దశలో నారాయణ విద్యా సంస్థలు విద్యార్ధుల్లో ప్రతిభను గుర్తించి మేలు బాట పరిచే క్రమంలో అక్రమ అరెస్ట్ చేయడం భాధాకరం.
నారాయణ విద్యా సంస్థలు అంటే దేశ వ్యాప్తంగా ఎంతో పేరెన్కగన్న సంస్థ. లక్షల మంది విద్యార్ధులను బంగారు భవిష్యత్ తీర్చిదిద్దే సంస్థపై ఇలాంటి అప్రతిష్ట చర్యలకు పూనుకోవడం అంటే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అవుతుంది. సచివాలయ ఉద్యోగుల విషయంలో పేపర్ ను ముందుగానే లీకేజీ చేసి ఏపీపీఎస్సీని నిర్వీర్యం చేశారు. ఒకప్పుడు పదో తరగతి ప్రశ్నా పత్రాలు కొట్టేసిన జగన్ రెడ్డికి నేడు అధికారంలో ప్రశ్నా పత్రాలు లీక్ అవ్వడం పెద్ద సమస్య కాదు. ఒక్క సంవత్సరం పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని జగన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు.