సీనియర్ ఐఎఎస్ అధికారి, వాణిజ్య పన్నులు, చేనేత జోలి, ఆహార పరిశ్రమల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వివాదరహితునిగా , అజాత శత్రువుగా పేరు గాంచిన మీనా గతంలో రాజ్ భవన్ కార్యదర్శి గా పనిచేసి, గవర్నర్ అభినందనలు అందుకున్నారు. 2014 లో షెడ్యూల్ ప్రకారం జరగవలసి సాధారణ ఎన్నికలు తాజా ఆదేశాలతో ముకేష్ కుమార్ మీనా నేతృత్వంలోనే జరగవలసి ఉంది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా మీనా నియామకం తక్షణం అమలు లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.