– దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మృతి కేసులో నేరస్తులెవరైనా శిక్ష తప్పదు
– అందుకే మా పార్టీ ఎమ్మెల్సీ అయినా హత్యానేరం కేసు నమోదు చేశాం
– చంద్రబాబును ఏనాడో దళిత సమాజం వెలివేసింది
– రాజకీయ లబ్ధి కోసం, పతాక శీర్షికలో వార్తల కోసం టీడీపీ – ఎల్లో మీడియా తాపత్రయం
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థాయిని తగ్గించేందుకు టీడీపీ కుట్రలు, కుతంత్రాలు
– సీఎం దావోస్ పర్యటన, సుబ్రహ్మణ్యం మృతిపై టీడీపీ ఊరకుక్కలవి విష ప్రచారాలే.
– దళిత సమాజంలో చంద్రబాబు నాయుడుకు నో ఎంట్రీ
– సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు తెలుగుదేశం పార్టీ రెడీనా?
– గ్రాఫిక్ మాయాజాలంతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మాయల మరాఠీ చంద్రబాబు
– వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు
ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే…
టిడిపి ఎల్లో మీడియా విషప్రచారం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, అధికార ప్రతినిధిగా ఇవాళ రెండు విషయాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియ చేయాలనుకుంటున్నాను. 1. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి దావోస్ పర్యటనపై ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారం. 2. మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు… తన కారు డ్రైవర్ ను హత్య చేశాడంటూ సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడి ఉదంతంపై తెలుగుదేశం పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం, పతాక శీర్షికలో వార్తలు రావడం కోసం, సంచలనాత్మకమైన ప్రకటనలు చేయడమే వారికి ప్రాథమిక అలవాటుగా మారింది. వాళ్ల రాజకీయ వ్యవహార శైలితో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి స్థాయిని తగ్గించాలనే కుతంత్రంతో కొంతమంది పందులను, కుక్కలను టీడీపీ మీడియా ముందుకు వదిలారు.
పట్టాభి అనే ఊరపంది, ఎన్టీఆర్‌గారిని తన అధికార దాహం కోసం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తుంటే ఆ సమయంలో దగ్గర ఉండి నక్క వినయ, విధేయతలు ప్రదర్శించిన యనమల రామకృష్ణుడు, భౌ భౌమని అరిచే కొంతమంది టీడీపీ నాయకులు నోళ్లకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో పరుష పదజాలం వాడటం సమంజసం కాకపోయినా, చదువుకున్న వ్యక్తులుగా, రాజకీయాల్లో ఉన్నతమైన విలువలు చూడాలనే కోరుకునేవారిగా, సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తులుగా తోటి రాజకీయ నాయకుల నుంచి ఎంతోకొంత సిద్ధాంతపరమైన వాగ్వివాదాలు కోరుకుంటాం. మా పార్టీ సిద్ధాంతం ఇదే అని మేము చెబుతాం. వాళ్ల పార్టీ సిద్దాంతాలు వాళ్లు చెప్పుకోవడంలో తప్పులేదు. 2014 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయం సాధించారు. అయిదేళ్లు రాష్ట్రాన్ని పాలించారు. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి చంద్రబాబు అయిదేళ్ల పాలనలో చెప్పిన ఏ ఒక్క మాట నెరవేర్చలేదన్న సత్యాన్ని గ్రహించిన ప్రజలు జగన్ మోహన్ రెడ్డిగారికి పట్టం కట్టారు. మే 23వ తేదీకి మేము అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతుంది. ఈ మూడేళ్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల పత్రికలు, టీవీ ఛానల్స్ ముఖ్యమంత్రిగారిని, ప్రభుత్వాన్ని పదే పదే నిందించడం, ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పును అగౌరవ పరచడం, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అవహేళన చేయడం చూస్తున్నాం. ఈ అసత్య ప్రచారాలను నిరూపించేందుకు తెలుగుదేశం పార్టీ తప్పుదారులను అవలంభించడం నిత్యకృత్యమైంది. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పందుల గుంపును మీడియా ముందుకు వదలడం అలవాటుగా మారింది.
జగన్ గారి స్థాయిని తగ్గించలేరు
పరుష పదాలను వాడటం ఇష్టం లేకపోయినా, పదే పదే మమ్మల్ని అవమానపరుస్తుంటే, మా నాయకుడిని పదే పదే కించపరుస్తున్నప్పుడు, ఏకవచన పదాలతో మాట్లాడు తున్నప్పుడు … మిమ్మల్ని కూడా బోషడికే అనో , నాయాలా అనో మేము కూడా వందసార్లు అనగలుగుతాను. బోషడికే పంది పట్టాభి ఇవాళ వరకూ వార్డు సభ్యుడిగా కూడా గెలవలేదు. ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లేదు. కేవలం పంది దొర్లినట్లుగా, కుక్క మొరిగినట్లుగా మీడియా ముందుకు వచ్చి సోది, సుత్తి మాట్లాడటం అలవాటుగా మారింది.
మేము ప్రతిపక్షం నుంచి సహేతుకమైన వాదన కోరుకుంటున్నాం. టీడీపీకి నిజంగానే రాజకీయ చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విదేశీ పర్యటనలు చేశారు. ఆ పర్యటనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన మేలు ఎంత? తెచ్చిన పెట్టుబడులు ఎంత? స్థాపించిన పరిశ్రమలు ఎక్కడ? ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. సిగ్గు ఎగ్గులేని చంద్రబాబు నాయుడు కింద పనిచేసే ఊరకుక్కల గుంపులు 24 గంటలూ మీడియాలో వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడినంతమాత్రాన మీరు రాజకీయంగా లబ్ధి పొందుతారనుకుంటే పొరపాటే. ముఖ్యమంత్రి జగన్ పాలనలో లబ్ధిపొందినవారి కోట్లాది ప్రజల గుండెల్లో జగన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు.
సహేతుకమైన విమర్శలు చేయండి
ప్రతిపక్షం టీడీపీ అయినా, మీ దత్తపుత్రుడిని అయినా సహేతుకమైన వాదనలు చేయమని సూచిస్తున్నాం. ప్రజలకు మేలు చేసేలా మీ వాదనలు ఉండాలే కానీ, ముఖ్యమంత్రిగారు ప్రయాణిస్తున్న విమానం దావోస్‌కు వెళ్లకుండా మధ్యలో ఎందుకు ఆగింది? ఆయన బాత్రూమ్కు వెళ్లారా? మరొకటా అనేవి మీకెందుకు అని ప్రశ్నిస్తున్నాం.
బాబులా దొంగ మాటలు చెప్పం
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్లారు. ఖచ్చితంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తారు కదా, అంతవరకూ వేచి చూడాలి కదా?. మనీ మేనేజ్మెంట్ కోసం ముఖ్యమంత్రి లండన్‌లో దిగారని విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఆయన మనీతో మేనేజ్ చేస్తే జగన్ మోహన్ రెడ్డి 2014లోనే ముఖ్యమంత్రి అయ్యేవారు.
రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చి ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం. మేము అధికారంలోకి రావడానికి ఏరోజు ఒక్క దొంగమాట చెప్పలేదు. ప్రజలను మోసం చేయలేదు. అమలు చేయలేని పనిని జగన్ ఎన్నడూ చెప్పలేదు. కానీ చేస్తానన్న పనులని అధికారంలోకి వచ్చిన ఆరు నెల్లోనే ఆయన అమలు చేశారు.
టిడిపి హయాంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి?
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అదే ఈ మూడేళ్లలో జగన్ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? తీసుకువచ్చిన పెట్టుబడులు ఎన్నో రికార్డులు తీస్తే తెలుస్తుంది. నవ యువ ముఖ్యమంత్రిగారు, మరోవైపు ఆర్థిక శాఖమంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్… ఆంధ్రప్రదేశ్ తరపున దావోస్‌కు వెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి, అక్కడున్న పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమలు తీసుకురావడం ద్వారా మన బిడ్డలే బాగుపడతారు కదా?
చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని అమరావతి పేరు చెప్పి సింగపూర్, లండన్, కజఖిస్తాన్ అంటూ పర్యటనలు చేసి, చివరకు రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాలేని దౌర్భాగ్యుడు. గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆంధ్రప్రజలను మోసం చేసిన మాయల మారాఠీ చంద్రబాబు.
నేరం చేసిన వాళ్ళు ఎవరైనా ఒకటే..
ఎమ్మెల్సీ అనంతబాబు కారులో దళిత యువకుడు మృతదేహం లభించినప్పుడు, అందుకు ఎమ్మెల్సీ బాధ్యత వహిస్తాడు. ఈ రాష్ట్రంలో నేరం చేసినవాళ్లు, ముఖ్యమంత్రిగారి దృష్టిలో నిందితులు ఎవరైనా ఒక్కరే. వాళ్లు ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా సరే. నేరం చేసినవాళ్లకు శిక్ష పడాల్సిందే. మన పార్టీ అయినా, ఏ పార్టీ అయినా అన్యాయం జరిగినవారికి అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది.
మృతుడు సుబ్రహ్మణ్యం దళితుడు అయిన మాత్రాన అక్కడ దళితులందరినీ ఏకం చేసి అల్లరి చేసినంత మాత్రాన దళిత సమాజంలో చంద్రబాబు నాయుడుకు ఎంట్రీ లేదు. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం, ఆయన భూమి మీద బతికి ఉన్నంతవరకూ మాల, మాదిగల పల్లెల్లోకి వచ్చే అవకాశమే లేదు. చంద్రబాబుకు అక్కడ నిషేధం విధించాం. ఎందుకంటే చంద్రబాబు దళిత వ్యతిరేకి కాబట్టే, మా సమాజం నుంచి నిన్ను వెలివేశాం. చంద్రబాబుకు దళిత సమాజంలో ఎంట్రీ లేదు.
నారాయణ రెడ్డి ని హత్య చేస్తే టిడిపి నేతలపై కేసులు పెట్టారా?
ఓ హత్య జరిగినప్పుడు జరిగినప్పుడు నిజ నిర్థారణ చేయాలి. పోలీసుల విచారణ జరుగుతోంది. అనుమానితుడిగా మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఉన్నాడు. ఈ హత్య కేసులో అతడినే ఏ1గా కేసు నమోదు చేశారు. అదే చంద్రబాబు హయాంలో హత్యలు జరిగితే ఎంతమందిని ఏ1గా పెట్టారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. కర్నూలు జిల్లాలో చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణ హత్యకు గురైతే మీ పార్టీ నాయకులపై అనుమానాలు వ్యక్తం చేస్తే, ఒక్కరి మీద అయినా కేసులు పెట్టారా? దళితులపై దాడులు జరిగితే, ప్రకాశం జిల్లాలో దళితుల భూములను అడ్డదిడ్డంగా దోచుకుంటే అన్యాయం కదా అని గళమెత్తిన మాలాంటివారిపై అన్యాయంగా కేసులు పెట్టింది మీరు కాదా చంద్రబాబు?
బాదుడే బాదుడు అంటూ తిరుగుతున్న చంద్రబాబును.. ప్రజలే చీపుర్లుతో కొడతారు. ప్రజలకు మేలు చేసిన పాపాన పోలేదు. మళ్లీ దొంగ ప్రచారాలతో జగన్ గారి మీద దుష్ప్రచారాలు చేస్తున్నాడు. మీ హయాంలోనూ, మా ప్రభుత్వం మూడేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై మేము చర్చకు సిద్ధం అని సవాల్ చేస్తున్నాం. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎలాంటి ఆకలి చావులు లేవు. ముఖ్యమంత్రి జగన్‌గారు దూరదృష్టితో, ఆర్థిక తత్వవేత్తలా ఆలోచించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచారు. ఒక లక్షా, 37వేల కోట్ల నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేసిన తొలి ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే జగన్ మోహన్ రెడ్డిగారేనని సగర్వంగా చెబుతున్నాం. ఆ లబ్ధిదారుల్లో అత్యధికులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే. వారి కడుపు నింపితే మీకు కడుపు మంట. డబ్బులను పప్పుబెల్లాలుగా పంచుతున్నారంటూ విషప్రచారం చేసే దుర్మార్గుడు చంద్రబాబు.
దావోస్ పర్యటన అయినా, సుబ్రహ్మణ్యం మృతి ఘటన అయినా మీ ఊరకుక్కలవి విష ప్రచారాలే. ఆ దుష్ప్రచారాలు ఆపేస్తే మంచిదని సూచిస్తున్నాం. మా ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధిలో లోటుపాట్లుపై సూచనలు చేసి, చేతనైతే సహేతుకమైన విమర్శలతో వస్తే ఆహ్వానిస్తాం. చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ అనుభవాలతో సిద్ధాంతపరమైన వాదనలకు వస్తే స్వాగతిస్తాం.