Suryaa.co.in

Entertainment

గొంతు ఆ ఇంటి వంతు!

నటుడిగా ఆయనొక్కడే..
గొంతుగా ఎందరో..
శివాజీ..జెమినీ..
రాజ్ కుమార్..ప్రేమనజీర్..
ఉదయ్ కుమార్..
ఎందరో మహానుభావులు
అందరికీ ఆయన గొంతే..
ఒరిజినల్ తో సమానంగా
కొండొకచో మరింత గంభీరంగా..!

పుట్టినప్పుడు ఏమీ తీసుకురామంటారు..
కాని పిజే శర్మ
గొప్ప గొంతును తెచ్చుకున్నాడు..
తెచ్చుకుని తాను మాత్రమే
దాచుకోలేదు..
పది మందికీ పంచిపెట్టాడు..!

శర్మ గళం మాటల గంగాళం
ఎంత గొప్పదో ఆ నాళం..
మాటల్లోనే హిందోళం..
డైలాగుల ఆది తాళం…!
అరిచే కొద్దీ స్పష్టత..
విరిచే కొలది గాంభీరత..!!

డబ్బింగ్..గాత్రదానం..
ఈ కళే
ఆయన కోసం పుట్టిందో..
ఆయనే ఈ కళ కోసం పుట్టాడో..
అసలు ఆ కళ
ఆయనతోనే పుట్టిందో..
ఆ తర్వాత ఇంకెందరికి
అన్నం పెట్టిందో..!

నటనలోనూ విలక్షణమే
జడ్జి..ఎస్పీ..
ఇంటి యజమాని..
ఊరి పెద్ద..
పెద్దరికం నిండిన పాత్ర ఉంటే
శర్మకే డైరెక్టర్ల ఫోను తక్షణం..
అలాంటి హుందా పాత్రల కోసమే పెద్దాయన ప్రతీక్షణం
ఆ పాత్రలను పండించాలనే
పరితపించారు ప్రతిక్షణం!

మాకేమి మిగిల్చావు నాన్నా..
శర్మగారి అబ్బాయిలు
ఇలా అడిగేందుకు లేదు..
అపారమైన స్వర సంపద..
సాయి..అయ్యప్ప..రవి
అందరికీ ఆయ్య గొంతు
అందిన మావి..
స్వరమే ఆ కుటుంబం సర్వం
గళమెత్తి గర్జిస్తున్నారు తరాలుగా..
గొప్ప గొంతే పొందారు వరాలుగా..
ఆల్ ఫోర్..గొంతులో ఫైర్..!
పి.జె.శర్మ గారి జయంతి సందర్భంగా ప్రణామాలు అర్పిస్తూ..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE