-ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
గత మూడేళ్లుగా అవే పాఠ్య పుస్తకాలు. ఆ టీచర్లే ఉన్నారు. అయినా ఈ ఏడాది ఎక్కువ విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే, కరోనా వల్ల గత రెండేళ్ల నుంచి పాఠాలు సరిగ్గా చెప్పలేకపోయారు. కరోనా వల్ల టీచర్లు క్లాస్‌లు చెప్పలేదు. ఎక్కువగా ఆన్లైన్ క్లాస్‌లే.
దాన్ని పిల్లలకు వివరించి, వారిలో ఆత్మస్థైర్యం పెంచే విధంగా చూడాలి తప్ప, వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా ఉండకూడదు. పిల్లలతో అలా రాజకీయాలు ఎందుకు?పిల్లల పేపర్లు దిద్దేది ఎవరు? ఉపాధ్యాయులు. వారు ఉన్నత విద్యావంతులు. నిపుణులు. వారు పేపర్లు దిద్దుతారు. అంతేకానీ ప్రభుత్వం, అధికారులు కాదు కదా? అయినా ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేస్తున్నారు?
జూమ్ కాల్‌కు మేము వెళ్లాము. ఎందుకంటే ఇదే విషయం చెప్పడానికి. లోకేష్‌కు ధైర్యం ఉంటే, మాతో మాట్లాడొచ్చు కదా? ఆయన తన ముందు స్క్రిప్ట్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అందుకే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక, మేము కాన్ఫరెన్స్‌లోకి పోగానే లైన్ కట్ చేశాడు.