-గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు తిరగబడుతుంటే…ఈ రోజు తాడేపల్లి సమీక్షలో జగన్ రెడ్డిపై ఏకంగా ఎమ్మెల్యేలే తిరగబడ్డారు
-ఎమ్మెల్యేలు వాస్తవాలు చెబితే సీఎం వారిని దబాయించి నోరుమూయించే ప్రయత్నం చేశారు
-రైతు అంటే పాలేరులా భావిస్తున్నావా జగన్ రెడ్డీ…మూడు పూట్లా అన్నం పెట్టే రైతంటే మీకు లెక్కలేదా
-సొంత జిల్లాలో నేరాలు ఘోరాలు, భూకుంభకోణాలు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రోత్సహిస్తారా
-రాష్ట్రాన్ని, ప్రజల భవిష్యత్తును కాపాడుకోవడమే లక్ష్యంగా మేం పనిచేస్తాం
-పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కడప జిల్లాలోని పరిస్థితులను చూస్తే అసలిది ముఖ్యమంత్రి సొంత జిల్లానేనా అనే ఆశ్చర్యం వేస్తోంది.జిల్లాలోని రైతులను జగన్ రెడ్డి ప్రభుత్వం నిండా ముంచేసింది..కడప స్కాములు, మాఫియా కేంద్రంగా మారిపోయింది.వైఎస్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా అనే కనికరం కూడా సీఎంకి లేకుండా పోయింది.నెల్లూరే అనుకుంటే అంతకుమించి నేరాలు ఘోరాలకు కడప జిల్లా కేంద్రంగా మారిపోయింది.
కుందూ నదిలో సిల్టు తొలగింపు పేరుతో ఇసుక వ్యాపారం చేస్తున్నారు..ఓ వైపు ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్లు బిల్లు తీసుకుంటూ మరోవైపు ఇసుక అమ్ముకోవడం ద్వారా మరో 1500 కోట్లు వరకు దోచుకుంటున్నారు.పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో బెరైటీస్ అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరిగిపోతోంది..
బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా కుందూ నుంచి బ్రహ్మసాగర్ కు ప్రాజెక్టు నిర్మాణానికి 350 కోట్లతో శంకుస్థాపన చేస్తే ఈ రోజుకి రూ.3 కోట్ల పనిజరగలేదు.సొంత జిల్లాలోనే సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలకు విలువలేకుండా పోయింది..భారీగా దోపిడీలు జరుగుతున్నాయి.. ల్యాండ్ మాఫియా చెలరేగిపోతోంది.ఒక్క బద్వేలు నియోజకవర్గంలోనే 2 వేల ఎకరాల భూకుంభకోణం జరిగిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది..
ప్రజల సొత్తుతో జీతాలు తీసుకుంటున్న అధికారులు కళ్లు మూసుకుకూర్చున్నారా.భూకుంభకోణాలకు పాల్పడుతున్నవారిని, వారికి సహకరిస్తున్న వారిని నడిరోడ్డులో ఉరితీయాలి.సీఎం సొంత జిల్లాలోనే అధికారులు, వైసీపీ నేతలు భయంభక్తులు లేకుండా చెలరేగిపోతూ దోపిడీకి పాల్పడుతుండటం దుర్మార్గం.బిందు తుంపర్ల సేద్యాన్ని నిర్లక్ష్యం చేసి రాయలసీమ రైతులను జగన్ రెడ్డి ప్రభుత్వం నిండాముంచేసిన విధానంపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ వాస్తవాలను బట్టబయలు చేసింది.ధాన్యం కొనుగోలు విధానంలో జరిగిన అక్రమాలతో మా నెల్లూరు జిల్లాలో రైతులు మూడు వేల కోట్లు నష్టపోగా, సీఎం సొంత జిల్లా రైతులు కూడా వెయ్యి కోట్లు నష్టపోయారు.
పులివెందుల నియోజకవర్గంలో యువరైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎంలో కనీస స్పందన లేకపోవడం బాధాకరం.వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడమంటే రైతుల మెడకు ఉరి వేయడమే.కడప జిల్లాలో రైతులకు దిక్కులేదని వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య చెప్పగా..అసెంబ్లీలో రైతుల సమస్యలు ప్రస్తావించే అవకాశమే ఇవ్వడంలేదని తాజా మాజీ డిప్యూటీ సీఎం క్రిష్ణదాస్ వాపోగా, ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ ఆధారాలతో సహా బయటపెట్టారు.వైసీపీ ప్రభుత్వంలో చేసేదేమైనా ఉందా అంటే..ఏట్లో దొరికే ఇసుక అమ్ముకోవడం, పెట్రో ఉత్పత్తులపై పన్నులు బాదం, పిచ్చి మందు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం