– డిప్యూటీ స్పీకర్ పద్మారావు
సికింద్రాబాద్ పరిధిలో రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఉప సభాపతి పద్మారావు అధికారులను ఆదేశించారు. లాలాపేట పరిధిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్థలాలు కోల్పోయిన నలుగురికి రూ.80.62 లక్షల మేరకు చెక్కులను కార్పొరేటరలు సామల హేమ, రాసురి సునీత,
అధికారులతో కలిసి పరిహారంగా అందచేశారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ సికింద్రాబాద్ లో రూ. వంద కోట్ల తో రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని నిర్ణయించి విజయవంతంగా అమలు జరుపుతున్నామని తెలిపారు. లాలాపేట్ లో 152 కట్టడాలను తొలగించాల్సి ఉండగా ఇప్పటికే 123 కట్టడాలను తొలగించామని, రూ. 42 కోట్ల మేరకు నిధులను పరిహారంగా చెల్లించినట్లు తెలిపారు. విస్తరణ పనులను త్వరగా ముగించాలని సూచించారు. అధికారులు యమున, తెరాస నేతలు పాల్గొన్నారు.