Suryaa.co.in

Andhra Pradesh

గేదల దొడ్డిలో రాజన్న క్యాంటీన్…మహా పాపం ఆర్కే.!

– మంగళగిరి నియోజకవర్గ టిడిపి వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య

వైసీపీ నేతలు ఎంతో అభిమానించే రాజన్నని గేదల దొడ్డిలో పెట్టి అవమానించావు. ఎన్నికల ముందు వాడుకున్న రాజన్న ఇప్పుడు గుర్తులేరా? ఎన్నికల ముందు రాజన్న క్యాంటీన్, రాజన్న కూరగాయలు స్కీములు…ఎన్నికల తరువాత గేదెల దొడ్డి లో రాజన్న…ఆర్కే ఇంట్లో కూరగాయలు.

పేదల మీద ఎన్నికల ముందు కురిపించిన ప్రేమ ఎక్కడికి పోయింది? రూ.4 భోజనం స్కీం ఎక్కడికి
mla-rk పోయింది? పేదల ఇళ్లు కూల్చడం, పేదల నోటి దగ్గర కూడు లాక్కోవడం కొత్త స్కీములా? రాజన్న క్యాంటీన్ , కూరగాయల పథకాలు రద్దు చేసి, జగన్ రెడ్డి ఇళ్ల విధ్వంసం…సైకో ఆర్కే అనే కొత్త స్కీములు ప్రవేశపెట్టారా?

ఓట్ల కోసం ఆర్కే వేసిన నాటకాలు అన్ని ప్రజలకు అర్ధమయ్యాయి. మంగళగిరి లో మాయగాడు ఆర్కే చాప్టర్ క్లోజ్ అవ్వడం ఖాయం. బుర్ర తక్కువ వాడు కాబట్టే అన్న క్యాంటీన్ ఏర్పాటుని అడ్డుకున్నాడు. పెద్ద మూర్ఖుడు జగన్ రెడ్డి…. చోటా మూర్ఖుడు ఆర్కే అని తేలిపోయింది.

రాజన్న ఆత్మ క్షోభిస్తుంది ఆర్కే…:- టిడిపి గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస రావు
ఎన్నికల ముందు పబ్లిసిటీ స్టంట్ కోసం వాడిన నీ రాజన్న క్యాంటీన్ బండి ఎక్కడ? రూ.4 కే భోజనం స్కీం ఎక్కడికి పోయింది? రూ.10 కే 5 రకాల కూరగాయలు స్కీమ్ ఎక్కడికి పోయింది కరకట్ట కమల్? ఎన్నికల్లో గెలవగానే రాజన్న క్యాంటీన్ బండిని ఫార్మ్ లో దాచేసిన నువ్వా నీతులు చెప్పేది?

పేదల ఇళ్లు కూల్చావ్, ఇప్పుడు పేదల నోటి దగ్గర ముద్ద లాగేసావ్. నీకు చిత్తశుద్ధి ఉంటే, రాజశేఖర్ రెడ్డి మీద నీకు అభిమానం ఉంటే మూలన పడేసిన రాజన్న క్యాంటీన్ వెంటనే తెరవాలి. పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కునే జగన్ రెడ్డికి, కరకట్ట కమల్ కి ఇంగిత జ్ఞానం తో పాటు మానవత్వం కూడా లేదు.

LEAVE A RESPONSE