Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ నేతలు పోలీసు భూమి కబ్జా చేస్తున్నారు కాపాడండి

– డీజీపీకి వర్ల రామయ్య లేఖ

చంద్రగిరిలో పోలీసు శాఖకు కేటాయించిన భూమిని అధికార వైసీపీ నేతలు అక్రమంగా ఆక్రమించేందుకు యత్నిస్తున్నట్లు, వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ కి లేఖ రాసిన తెదేపా నేత వర్ల రామయ్య
* పార్టీ కార్యాలయం కోసం పోలీసు భూములపై వైసీపీ ల్యాండ్‌మాఫియా కన్ను వేయడం బాధాకరం.
* వైసీపీ చర్యలతో పోలీసు సిబ్బందిలోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి.
* వైసీపీ ఎమ్మెల్యే అక్రమంగా పోలీసు భూమిలో రహస్యంగా భూమిపూజ చేసినట్లు తెలుస్తోంది.
* ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ స్థలం పోలీసు శాఖకు చెందినది.
* పోలీసుల సంక్షేమం కోసం ఒక ఫంక్షన్ హాల్ నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు.
* నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో పోలీసు భూమిలోకి ఎవరూ చొరబడకుండా నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
* పోలీసు అధిపతిగా, పోలీసు శాఖ ఆస్తులను రక్షించడం మీ బాధ్యత.
* మీ బాధ్యతలు విస్మరించి నేడు చర్యలు తీసుకోకపోతే వైసీపీ ల్యాండ్ మాఫియా పోలీసు పరేడ్ గ్రౌండ్స్, పోలీసు స్టేషన్లను కూడా ఆక్రమించే ధైర్యం చేస్తారు.
* కావున, పోలీసు సిబ్బంది ప్రయోజనాల దృష్ట్యా చంద్రగిరిలో భూమి అన్యాక్రాంతం కాకుండా నిరోధించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.

LEAVE A RESPONSE