Suryaa.co.in

Andhra Pradesh

బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి

– బీసీలపై కక్షసాధింపు చర్యల్లో భాగమే అయ్యన్నపాత్రుడి ఇంటి కూల్చివేత
– టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులను రాష్ట్రం నుంచి తరిమికొడతాం
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న

జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది. వైసీపీకి ఓట్లు వేయరనే ఉద్దేశంతో మొన్నటివరకూ కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేశాడు. చంద్రబాబుగారి ఉత్తరాంధ్ర పర్యటనతో బీసీలంతా టీడీపీ వెంటే ఉన్నారని స్పష్టమవడంతో కక్షకట్టి అయ్యన్న పాత్రుడి గారి ఇంటిపై జేసీబీతో దాడి చేశారు. ఆయనపై అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబు గారిపై వైసీపీ నేతలు బూతులు మాట్లాడినా, ఆయన కుటుంబసభ్యుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దిగజారుడు వ్యాఖ్యలు చేసినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారే కానీ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు.

పై పెచ్చు చంద్రబాబు ని దూషించిన వారికి వైసీపీలో పదవులు కట్టబెట్టారు. అయ్యన్నపాత్రుడి ఇంటి దగ్గర అంత బందోబస్తు అవసరమేంటి? ఆయన ఏం తప్పు చేశారు? పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక వైసీపీ కోసమా? 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తాం. మీరు ఒక ఇల్లు పగలకొడితే మేము 10 ఇళ్లు పగలకొడతాం. వైసీపీ నాయకులు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేస్తాం. మూడేళ్లుగా మా సహనాన్ని , ఓర్పును, నాయకత్వాన్ని పరీక్షిస్తున్నారు. మిమ్మల్ని వదలం. బీసీలంటే జగన్ కు ఎందుకంత చులకనా? చోడవరంలో లక్షలాది ప్రజలు చంద్రబాబుగారికి బ్రహ్మరథం పట్టారు. నెల్లిమర్ల, చీపురపల్లి సభలకు స్వచ్ఛందంగా ప్రజలు పోటెత్తారు. ప్రజా ప్రవాహం చూసి తట్టుకోలేక అయ్యన్న ఇంటిపై పడ్డారు. కక్షసాధింపుచర్యలకు పాల్పడిన ఏ వైసీపీ నేతను రాష్ట్రంలో తిరగనివ్వము. కొడాలి నాని, ద్వారంపూడి, అప్పలరాజు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే పదవులు ఇస్తారా?గన్ మేన్ ఇస్తారా? మేము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు చేసి అక్రమ కేసులు పెడతారా?

వైసీపీది చెత్త ప్రభుత్వం కాదా? మీరు చెత్తనా కొడుకులు కాదా? చెత్త మీద పన్ను వేసే వాళ్లను చెత్తనా కొడుకులు కాక మరేమనాలి? అయ్యన్న పాత్రుడు బీసీ కాబట్టే కక్ష కట్టారు. వైసీపీ నేతల గంజాయి స్మగ్లింగ్, మైనింగ్, ల్యాండ్ మాఫియాను ప్రశ్నిస్తున్నారని, ప్రజల్లోకి తీసుకెళుతున్నారని అయ్యన్నపై కక్ష కట్టారు. తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయించే రోజులు దగ్గరకొచ్చాయి. ప్రజలు చైతన్యవంతులు. ఒక చెంప పగలకొడితే రెండు చెంపలు పగలకొట్టే భగత్ సింగ్ సిద్ధాంతాన్ని అనుసరిస్తాం. బీసీలకు పేరుకే మంత్రి పదవులు ఇచ్చి అధికారమంతా జగన్ రెడ్డి సామాజిక వర్గమే చెలాయిస్తోంది. చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో తాడేపల్లి ప్యాలెస్ లో స్కెచ్ వేశారు. అందులో భాగమే అయ్యన్నపాత్రుడి గారి ఇంటిపై జేసీబీ దాడి. ఎవర్నీ వదలం. దెబ్బకు దెబ్బ తీస్తాం. మా బీసీలు ఎవరి జోలికీ వెళ్లరు. మేము జగన్ రెడ్డి మోచేతి నీళ్లు ఎందుకు తాగాలి? మేము ప్రశ్నించకూడదా? అయ్యన్న ఇల్లు కూల్చి, అక్రమ కేసులు పెట్టి చాలా తప్పు చేశారు.

చంద్రబాబు పై విజయసాయి నోటికొచ్చినట్టు మొరుగుతున్నాడు. విజయసాయి కుక్క. అతణ్ణి కుక్క అంటే కుక్క కూడా సిగ్గుపడుతుంది. దొంగలెక్కలు రాసే విజయసాయిని ఏ జంతువుతో పోలిస్తే ఆ జంతువు ఇబ్బంది పడుతుంది. ఖబడ్దార్ వైసీపీ నాయకులారా? మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ప్రజల్లో ఎదురైన ఛీత్కారం చూసైనా వైసీపీ నేతులు సిగ్గుతెచ్చుకోవాలి. దోచుకున్న రూ. 1500 కోట్లు కక్కి తర్వాత తమ దగ్గరకు రమ్మని వెల్లంపల్లిని ప్రజలు ప్రశ్నించిన సంగతి గుర్తుంచుకోండి. వైసీపీ నేతలు ప్రచారానికి పోలీసులు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు?

పోలీసులు తమ ఆత్మాభిమానాన్ని జగన్ దగ్గర తాకట్టు పెట్టారు. అయ్యన్న ఇంటిపై దాడి, అక్రమ కేసులు పెట్టడం బీసీలపై కక్ష సాధింపు చర్యల్లో భాగమే. మేము ఎవర్నీ వదలం. కేసులకు భయపడం. టీడీపీ బీసీ నేతలందరం బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రమంతా తిరిగి వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు చెబుతాం. ఇళ్లు కూల్చడం, అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాల్జేయడమేనా పాలనంటే? చంద్రబాబు గారి ఉత్తరాంధ్ర పర్యటన ముగియగానే కక్షసాధింపుకు దిగుతారా?

జగన్ రెడ్డి సైకోయిజం పరాకాష్టకు చేరింది. బీసీలంటే జగన్ కు పడదు. బీసీలంతా చంద్రబాబు వెంట ఉన్నారనే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు. ఈ చెత్త ప్రభుత్వాన్ని చెత్త నా కొడుకులు పాలిస్తున్నారు. మీరెన్ని కేసులు పెట్టినా భయపడం. దెబ్బకు దెబ్బ తీస్తాం. చంద్రబాబు గారి పర్యటన విజయవంతమైన మరుసటి రోజే మీకు ఇవన్నీ గుర్తొచ్చాయా? మూడేళ్ల నుంచి ఏం చేస్తున్నారు? ఇరిగేషన్ స్థలం, జగన్ రెడ్డి స్థలమని ఏమైనా మాట్లాడతారు? ఎన్నికలు ఎప్పుడు వస్తాయా వైసీపీని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

LEAVE A RESPONSE