Suryaa.co.in

Entertainment

ఎమ్మెస్..స్వరపరిస్తే.. ఓ ఎస్!

ఏ తీగ పూవునో..
ఏ కొమ్మ తేటినో..
కలిపింది ఏ వింత
అనుబంధమౌనో..

నేనా పాడనా పాట..
మీరా అన్నదీ మాట..
కళ్ళలో ఉన్నదేదో
కన్నులకే తెలుసు..

ఇదీ మెలోడీ..
ఎమ్మెస్ విశ్వనాథన్
సంగీత గారడీ..
కట్టి పడేసే పాటలు..
అద్భుత రాగాల పూదోటలు
సినిమాల విజయానికి బాటలు..
స్వరాల మూటలు!

ఎప్పటి మనిషి..
చిన్నప్పుడే ఆపకుండా
మూడు గంటలు
కచేరీ చేసిన సంగీత స్రష్ట..
నటుడవుదామనుకుంటే
కుదురుద్దా..
అన్ని పాటలు ఆయన పేరిట
రాసి పెట్టి ఉంటే..
విధి చేయు వింతలన్నీ..
మతి లేని చేష్టలు కాక
నాలో ఉన్న టాలెంట్
నాకు గాక ఇంకెవరికి తెలుసంటూ..
నటయత్నాలు మాని
స్వరబ్రహ్మ మామతో దోస్తీ..
దేవదాసుతోనే మొదలైంది
రామ్మూర్తితో కలిసి
పాటలతో కుస్తీ..
స్వరాల గస్తీ..!

ఎవ్వరో పాడారు
భూపాలరాగం.. సుప్రభాతమై..
ఈ పాట స్వరరంజితమై..

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో..
ఈ గీతం శాశ్వత పాగా
వేయలేదా మెలోడీ కోటలో..
భలే భలే మగాడివోయ్
బంగారు నా సామిరో..
యువత తాలియా మారో..

ఏ తరానికి ఏది నచ్చుతుందో
అది వినిపించిన స్వరగని..
అనంత సంగీత వాహిని..
సినిమా పాటకు శాశ్వత కీర్తి
విశ్వనాథన్ స్ఫూర్తి..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE