Suryaa.co.in

Family

అదీ భారతీయుల తరతరాల సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం!

కారు మేఘాలు కమ్ముతున్నాయి
ఏక్షణంలో అయినా…
వర్షం విపరీతంగా కురుస్తుంది…!
వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !అయినా..ఆమె ముగ్గువేస్తోంది… !
అదీ..సంప్రదాయం!

అంతర్జాతీయ ఖ్యాతినార్జించి
అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా
పాఠాలు చెప్పిన పంతులుకు
పాదాభివందనం చేస్తాడు…!
అదీ .. సంస్కారం !

ఖగోళ శాస్త్రాన్ని
నమిలి మింగిన నిష్ణాతుడు.
నిష్టగా ఉంటూ
గ్రహణం విడిస్తేగానీ…
ఆహారం గ్రహించడు…!
అదీ .. నమ్మకం !

పరమాణు శాస్త్రాన్ని
పిండి పిప్పిచేసిన పండితుడు.
మనవడి పుట్టు వెంట్రుకలు
పుణ్యక్షేత్రంలో తీయాలని
పరదేశం నుండి పయనమై వస్తాడు…!
అదీ .. ఆచారం !

అంతరిక్ష విజ్ఞానాన్ని
అరచేతబట్టిన అతిరధుడు.
అకుంఠిత నిష్ఠతోtreditions2పితృదేవతలకు
పిండ ప్రదానం చేస్తాడు…!
అదీ .. సనాతన ధర్మం!

అత్తింటికి వెళ్లేముందు
ఇంటి ఆడబడుచు
పెద్దలందరికీ
పాదాభివందనం చేసి
పయనమవుతుంది…!
అదీ .. పద్ధతి !

పెద్ద చదువులు చదివినా
పెద్ద కొలువు చేస్తున్నా
పేరు ప్రఖ్యాతులున్నా
పెళ్లి పీటలమీద .. వధువు
పొందికగా ఉంటుంది…!
అదీ .. సంస్కృతి!

భార్య పక్షవాతానికి లోనయ్యింది.
మంచం దిగలేని పరిస్థితి
తనంతట తానుగా..
తనువీడ్చలేని స్థితి.
భర్త భరోసాగా నిలచి..భారమంతా మోస్తాడు-అన్నీతానై .. అలిని సాకుతాడు…!
అదీ .. దాంపత్యం!

బ్రతికే అవకాశం తక్కువ
వెంటిలేటర్ పై వేచిచూస్తే
బ్రతికితే బ్రతకొచ్చు!
లక్షల ఖర్చు భరిస్తూ
వెంటిలేటర్ పై పెడతారు… !
అదీ .. అనుబంధం!
ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సంప్రదాయాలు, విలువలు, ఔన్నత్యం కొన్ని మాత్రమే.

– మాశెట్టి రమేష్

LEAVE A RESPONSE