Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ నేతల కబ్జాలో మద్యం డిస్టలరీలు

– ప్రభుత్వ పెద్దల డిస్టలరీల్లోనే విషపు మద్యం తయారీ
– కమీషన్ల కోసం జే బ్రాండ్స్ తో జనాల ప్రాణాలు తీస్తారా? జగన్ రెడ్డి?
– తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

చీమలు పెట్టిన పుట్టలో విష పాములు చేరినట్టు టీడీపీ హయాంలో అనుమతిచ్చిన డిస్టరీల్లో వైసీపీ విషపు పురుగులు చేరి విషాన్ని ఉత్తత్పి చేసి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ద్వజమెత్తారు. మంగళవారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…..

విభజనంతరం డిస్టలరీలన్నీ తెలంగాణకే పరిమితం కావటంతో కొత్త డిస్టలరీలకు అనుమతివ్వటం జరిగింది. ఇప్పుడు ఆ డిస్టలరీలన్ని వైసీపీ నేతలు కబ్జాచేశారు. ఆ డిస్టలరీల్లో మద్యం తయారు చేసేది, వాటికి ధర నిర్ణయించేది,అమ్మేది అమ్మకాల్ని పోత్సహించేది ప్రభుత్వ పెద్దలే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా డిస్టలరీలకు అనుమతివ్వలేందంటున్నారు. కానీ అదాన్ డిస్టలరీ 2019 డిసెంబర్ 2 న ఏర్పడింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగన్ రెడ్డి కాదా? కేవలం రూ. 1 లక్ష మూలధనంతో ఏర్పాటైన అదాన్ డిస్టలరీకి రెండున్నరేళ్లలో రూ. 1164.86 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యంకు ఎందుకు ఆర్డర్లిచ్చారు? సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేని కంపెనీకి రెండేళ్ళలో రూ.1164 కోట్ల విలువైన 68 లక్షల కేసుల మద్యం సరఫరాకు అనుమతి ఎందుకిచ్చారు? ఈ కంపెనీ డైరక్టర్లలో ఒకరైన కాశీనాయన శ్రీనివాసులు విజయసాయిరెడ్డి అల్లుడైన పెనక రోహిత్ రెడ్డికి మిత్రుడు కాదా?

తెలుగుదేశం సానుభూతిపరులైతే వృద్దులకు సైతం పెన్షన్ ‎కట్ చేసే‎ జగన్ రెడ్డి టీడీపీ వాల్ల డిస్టలరీలు ఎందుకు కొనసాగిస్తారు? ఎస్పీవై ఆగ్రోస్ డిస్టలరీ టీడీపీ వాళ్లదయితే 40 బ్రాండ్లు సప్లై చేసేందుకు ఎందుకు అనుమతిచ్చారు? దారు హౌస్, చాంపియన్ స్పెషల్, సెలబ్రిటీ బ్రాందీ ఎక్స్ వో బ్రాందీ ఇలా ఒకటా రెండా 40 బ్రాండ్లకు అనుమతిచ్చారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ని, పెద్దిరెడ్డి కబ్జా చేసింది వాస్తవం కాదా? ఈ కంపెనీ వ్యవహారాలు మిథున్ రెడ్డి చూస్తుంది నిజం కాదా ఈ ఒక్క కంపెనీకే రూ.1,863 కోట్ల ఆర్డర్లు ఇచ్చి, 1.16 కోట్ల కేసుల మద్యం సరఫరా చేసింది నిజం కాదా ? ఎంఎస్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఆర్‌ అసోసియేట్స్‌ కంపెనీలు, ఒకే ప్రాంగణం, ఒకే చిరునామాతో ఉన్నాయి.

ఈ రెండు కంపెనీల యజమాని అమిరెడ్డి జైపాల్‌రెడ్డి. ఈయన వైసీపీకి అత్యంత సన్నిహితుడు కాదా? ఈ రెండు కంపెనీలకు రూ.774.71 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు, రెండేళ్ళలో ఇచ్చారు. తమిళనాడుకు చెందిన ఎస్‌ఎన్‌జీ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌ఎన్‌జీ షుగర్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీలకు, జగన్ కు సంబంధం ఏంటి ? శేఖర్ రెడ్డితో కలిసి ఏమి చేస్తున్నారు? కేవలం ఈ రెండు కంపెనీలకు కలిపి, రెండేళ్ళలో రూ.1996.66 కోట్ల విలువైన 2.12 కోట్ల కేసుల మద్యం సరఫరా చేసింది నిజం కాదా ? 100 పైగా డిస్టలరీలు మద్యం సరఫరా చేసేందుకు ధరఖాస్తు చేసుకుంటే జగన్ రెడ్డి మాత్రం కేవలం తన బినామీలు, పార్టీపెద్దలకు చెందిన 16 డిస్టలరీలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఎస్.జీ.ఎస్ ఇండియా ప్రవేట్ లి. నివేదిక తప్పని సాక్షి, వైసీపీ నేతలు ఎలా చెబుతారు? అరగంట మంత్రి సైటిస్తారా?
ల్యాబ్ లో టెస్టులు చేసేందుకు రూ. 1,41 లక్షలు చెల్లించిన బిల్లుకు సంబందించి ఇన్ వాయిస్, ఆ ల్యాబ్ రిపోర్టు మా దగ్గర ఉంది. (ఆ వివరాలు మీడియాకు చూపించారు) అన్ని నిబంధనలకుliq1 అనుగుణంగా పారదర్శకంగా ఎస్.జీ.ఎస్ ల్యాబ్ లో మద్యం నమూనాలు పరీక్షించి మద్యంలో మీరు సాగిస్తున్న దందా బట్టబయలు చేయటం జరిగింది. ఆంధ్రాగోల్డ్,సిల్వర్ స్ర్టైప్స్, నైన్ సీ హార్స్ విస్కీల్లో అత్యంత విషరసాయనాలున్నట్టు తేలింది? ఈ 3 బ్రాండ్లకు అనుతిచ్చిందెవరు? మేం నివేదికలు బట్టబయలు చేసిన తర్వాత మద్యం షాపుల్లో ఆ బ్రాండ్లు దొరక్కకుండా చేసింది మీరు కాదా? గతంలో ప.గో జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం త్రాగి చనిపోయిన ఘటనలో క్రోనిక్ అల్కాహాల్ తాగడం వల్లే చనిపోయారని ప్రభుత్వ డాక్టర్ రిపోర్టులు ఇచ్చారు. డిస్టలరీలను బెదిరించి ఆ డిస్టలరీల్లో మీ సొంత జే బ్రాండ్స్ మద్యం తయారు చేస్తూ వాటికి మీరే ధర నిర్ణయించి అమ్ముతున్నారు. మీ కల్తీ మద్యం త్రాగి 3 ఏళ్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, అయినా జగన్ రెడ్డి తన ధనదాహం కోసం విషపు మద్యం తయారు చేస్తూ ప్రజల శవాల మీద చిల్లర ఏరుకుంటున్నారు.

liq పానీ పూరి బండ్ల దగ్గర సైతం డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటుంటే మద్యం షాపుల్లో మాత్రం క్యాష్ తీసుకోవటం లేదు. లెక్కలు లేకుండా జగన్ రెడ్డి, వైసీపీ నేతలు మద్యంలో ఏడాది రూ. 5 వేల కోట్లు మూడేళ్లలో రూ. 15 వేల కోట్లు దండుకున్నారు. మరో వైపు వైసీపీ నేతలే పొరుగు రాష్ట్రాల మద్యం విక్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా రాష్టానికి క్యాసినో తీసుకువచ్చారు. విశాఖలోని ఓ క్రూయిజ్ లో విజయసాయిరెడ్డి కూతురు క్యాసినో నిర్వహిస్తోందని పొరుగు రాష్ట్రానికి రాకుండా అధికారులు క్రూయిజ్ ని అడ్డుకున్నారు. అక్రమ సంపాదన కోసం మహిళల తాళిబొట్లతో చెలగాటమాడుతున్న జగన్ రెడ్డికి బుద్దిచెప్పేందుకు మహిళలంతా సిద్దంగా ఉన్నారని వంగలపూడి అనిత హెచ్చరించారు.liq4
liq3
liq2liq

LEAVE A RESPONSE