– దళితుల అభ్యున్నతికి సీఎం కృషి
– పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పరిపాలన
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని, సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. శాసనమండలి సభ్యులు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు, ఎంపీలు సంజీవ్‌కుమార్, నందిగం సురేష్, గురుమూర్తి, mlc జంగా కృష్ణమూర్తి, sc కార్పోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకరావు మాదిగ తదితరులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో దీన జనోద్ధరణకే కాక హరిత విప్లవానికి శ్రీకారం చుట్టిన ఆధ్యుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని కీర్తించారు. దేశ వ్యవసాయశాఖ మంత్రిగా రైతులకు మొట్టమొదటిసారిగా గిట్టుబాటు ధర కల్పించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు ఆచరణలో పెట్టేదానిలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. విద్యారంగంపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించిన దార్శనికుడన్నారు.
ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ, చంద్రబాబు దళితులను విడదీయాలని విషపూరితంగా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్ ఎస్సీల ఐక్యతకు కృషి చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాల కుట్రలను మనమే సంఘటితంగా తిప్పికొట్టాలన్నారు.
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ, గడచిన మూడేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసమే అనేక పధకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వారిని బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దళితులను ఏకం చేయడానికి కృషి చేసిన బాబూ జగ్జీవన్‌రామ్ బాటలోనే జగన్ ముందుకు సాగుతూ ఎస్సీల ఐక్యత కోసం పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపధ్యంలో 2024లో కూడా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఎస్సీలంతా పార్టీలో సుశిక్షితులైన సైనికులుగా పని చేయాలని కోరారు.
ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, 40 సంవత్సరాల పాటు పార్లమెంట్‌లో పలు పదవులను బాధ్యతగా నిర్వర్తించిన నిస్వార్ధ రాజకీయ నేత జగ్జీవన్‌రామ్ అని ప్రస్తుతించారు. ఆయన చూపిన మార్గంలోనే ముఖ్యమంత్రి జగన్ అన్ని రంగాల్లో అణగారిన వర్గాలకు అగ్రస్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఎంపీ సంజీవకుమార్ మాట్లాడుతూ, సామాజిక న్యాయానికి నిర్వచనం తెలియాలంటే అది ఏపీని చూస్తే అర్ధమైపోతుందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి లభిస్తున్న అనూహ్య స్పందనే అందుకు నిదర్శనమని తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ లానే ముందుకు సాగుతున్న జగన్ నేడు బడుగు, బలహీనవర్గాల గుండెల్లో కొలువయ్యారని పేర్కొన్నారు. బడుగులకు మేలు జరగకుండా అడ్డు పడుతున్న ప్రతిపక్షం కుట్రలను తిప్పికొట్టి మనమంతా జగన్ వెన్నంటే నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, విలక్షణమైన రాజకీయాలతో అనేక పదవులు చేపట్టి వాటికి వన్నెతెచ్చిన ఆదర్శనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని శ్లాఘించారు. జగ్జీవన్‌రామ్ ఆలోచనలే ఆశయాలుగా మలుచుకుని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. అంటరానితనం, పేదరిక నిర్మూలన అనే ఆయన సిద్ధాంతాలనే పునాదిగా చేసుకుని సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని తెలిపారు. జగన్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదరికంపై జరుగుతున్న పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో దేశం యావత్తూ కులాలు, మతాలు పక్కనపెట్టి పేదరిక నిర్మూలన కోసం కృషి చేసిన నాడే జగ్జీవన్‌రామ్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అప్పిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్లు, డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి
స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 36వ వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతూ శైలాజా, స్థానిక కార్పొరేటర్ బాల గోవింద్, తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు, బుదాల శ్రీను, తోకల శ్యామ్,మదిరి ప్రభాకర్,లెల్లపూడి లాజర్,ఒగ్గు విక్కీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.