-వైయస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యుడైన తర్వాతే ఎమ్మెల్యేని, స్పీకర్ని
-మహానాడులో కోడెల శివప్రసాద్ మాట్లాడింది వినిపించలేదా? కనిపించలేదా రామోజీ
-ప్రత్యర్థులు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గందరగోళం సృష్టించే యత్నం చేస్తున్నారు
-కార్యకర్తలు, నాయకులకు జగన్ సంక్షేమం, అభివృద్ధి ఆయుధాలిచ్చారు. వాటితో ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేయండి
-మంచి చేసే ప్రభుత్వంపై పచ్చ పత్రికలు అసత్యాలు ప్రచారమంతా అబద్ధం. గడపగడపలో ప్రజాదరణే సాక్ష్యం
-2024లో ప్రతిపక్షాలన్నీ భూస్థాపితం.. 175 సీట్లతో వైయస్ఆర్ సీపీదే విజయం
-పార్టీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారాం
రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నామస్మరణే వినిపిస్తోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఒక గొప్ప మహానేత సతీమణి విజయమ్మ కూడా వేదికపై ఉన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం అనేక అవమానాలను ఎదురొడ్డి.. తన కుమారుడిని ఇంతటి గొప్ప ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దేందుకు వైయస్ విజయమ్మ నిర్వర్తించిన భూమిక, పాత్ర రాష్ట్రంలోనే కాదు.. దేశంలో మరువలేనిదని తమ్మినేని ధన్యావాదాలు తెలిపారు. వేదిక మీద మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పార్టీకి వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రాంతీయ కార్యదర్శులు, అన్ని జిల్లాల నుంచి కదిలి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు నమస్కారాలు చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండవరోజు పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకతపై తమ్మినేని సీతారాం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్ల ప్రగతిపై సమీక్షే ఈ ప్లీనరీ అని తమ్మినేని చెప్పారు. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్లీనరీకి విప్లవంలా తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించడమే మన ముందున్న లక్ష్యమని చెప్పారు.
మహానాడులో కోడెల శివప్రసాద్ మాట్లాడింది వినిపించలేదా? కనిపించలేదా రామోజీ
మొదట వైయస్ఆర్స్సార్సీపీ ప్రాథమిక సభ్యుడిని.. తర్వాతే ఎమ్మెల్యేను..ఆ తర్వాతే స్పీకర్ను.
స్పీకర్ ప్లీనరీకి వచ్చారు.. రాజకీయ సమావేశంలో పాల్గొంటున్నారని ఈనాడులో రాశారు. గడిచిన మహానాడులో ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడింది రామోజీరావుకు వినిపించలేదా? కనిపించలేదా (ఆర్ యూ డెఫ్ ఇయర్).. (ఆర్ యూ బ్లైండ్) అని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. శివ ప్రసాద్ ప్లీనరీకి హాజరవగా లేనిది.. నేను ప్లీనరీలో పాల్గొంటే తప్పా?. మొదటగా నేను వైయస్ఆర్స్సార్సీపీ ప్రాథమిక సభ్యుడిని.. తర్వాతే ఎమ్మెల్యేను..ఆ తర్వాతే స్పీకర్ను. ప్లీనరీ పండగ జరుగుతుంటే.. నేను ఇంట్లో కూర్చోవాలా అని ప్రశ్నించారు. మరి, ఆనాడు ఎందుకు రాశారు. ప్రభుత్వం చేసిన మంచిని ఏనాడైనా రాశారా..? ఇది సరైన పద్ధతి కాదు. సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్ని పత్రికలకు చెబుతున్నా. ఈనాడు నేను ఏదో కాని పని చేస్తున్నాను.. తప్పు పని చేస్తున్నానని రాసే పద్ధతి మానుకోవాలి. ఇప్పటికీ చెబుతున్నా.. రేపు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు కూడా చెబుతాను. నాకు పునర్జన్మనిచ్చిన రాజకీయ పార్టీ పండుగ జరుగుతుంటే నేను ఇంట్లో కూర్చోవాలా? అలా అయితే అందరూ స్పీకర్లు ఇంట్లో కూర్చోవాలి కదా అని తమ్మినేని ప్రశ్నించారు.
ప్రత్యర్థులు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గందరగోళం సృష్టించే యత్నం చేస్తున్నారు
సంక్షేమం, అభివృద్ధి అనే ఆయుధాల్ని జగన్ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చి నాలుగో ఏటలో అడుగు పెడుతున్నాం. మనం మూడేళ్లలో సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కాదు. మన ప్రత్యర్థులపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏనాడైనా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఆలోచించారా.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించారా..? ఏమీ చేయని వారు మాట్లాడుతున్నారు. అన్నీ చేసిన మనం చేతులు కట్టుకొని ముడుచుకుంటే ఎట్లా అని సీతారాం కార్యకర్తలను ఉద్దేశించి ప్రశ్నించారు. కదనరంగంలో అడుగుపెట్టాం.. సమరానికి సిద్ధం అవుతున్నాం. ఈ సమయంలో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహభరితంగా ముందుకుసాగాలన్నారు. 2024లో మళ్లీ విజయాన్ని సాధించడమే మనముందున్న లక్ష్యం.. ఆ లక్ష్యంవైపు సాగేందుకు సీఎం వైయస్ జగన్ సంక్షేమం, అభివృద్ధి అనే ఆయుధాలు ఇచ్చారని తమ్మినేని తెలిపారు.
మూడేళ్లలో సాధించిన విజయాల్ని ప్రజలకు కార్యకర్తలు చేర్చాలి
గత ప్రభుత్వాలు ఏం సాధించాయని విమర్శలు చేస్తున్నారు. ఎన్నో చేసిన జగనన్న విజయాలను ప్రజలకు వివరించి చెప్పాలి.
మూడేళ్లలో సాధించిన విజయాలు, ఎంత వరకు ప్రయాణం సాగింది. ఎక్కడ ఉన్నాం. ఈ ప్రయాణంలో ఏ మలుపులో ఉన్నామో సమీక్షించుకోవటానికే ఈ ప్లీనరీ పెట్టుకున్నాం. పార్టీ పెద్దలు, నేతలు ఇస్తున్న సందేశాల్ని స్వీకరించాలి. నిన్న పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మ ఇచ్చిన సందేశాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని తమ్మినేని కోరారు.
పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు
ప్రభుత్వ మంచిని ఒక్కటైనా ఏనాడైనా రాశారా?
పత్రికలు ప్రభుత్వం చేసిన మంచిని రాయాలి. కానీ పచ్చ పత్రికలు ఏనాడైనా ప్రభుత్వం చేసిన మంచి అయినా రాశారా? ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ వారికి కనిపించడం లేదు. అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ 175 స్థానాలు గెలిచి తీరుతుంది అని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. 16 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.
బటన్ నొక్కి నేరుగా పేదలకే జగన్ పథకాలు అందిస్తున్నారు
సంక్షేమ రథం ముందుకు వెళ్లాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి
సీఎం జగన్ బటన్ నొక్కితే అమ్మ ఒడి, వాహన మిత్ర, రైతు భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న చేయూత, విద్యా దీవెన, విద్యా కానుక, నేతన్న నేస్తానికి, ఆసరాకి చేరుతున్నాయి. ఈనాడు మధ్యలో దళారీలు, రాజకీయ బ్రోకర్లు లేరు. ఇలా అనేక సంస్కరణలు చేస్తున్నాం. వ్యవసాయం రంగంలో రైతు భరోసా, ఈ క్రాప్, ఈ ప్రొక్యూర్మెంట్, విత్తనాలు, రసాయనాలు, ఎరువు మందులు అందిస్తున్నాం. పేదరికం పోవాలంటే విద్య అనేది పనిముట్టు. పేదల జీవితాల్లో వెలుగులు రావాలంటే విద్యను అభ్యసించాలి. విజ్ఞాన ప్రపంచం పరుగులు తీస్తూ ముందుకు వెళ్తుంది. పోటీ ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థి కూడా విజేత కావాలని జగన్ కలలు కంటున్నారు. నాడు-నేడు ద్వారా కార్పొరేట్ స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. సీఎం వైయస్ జగన్తో ప్రయాణించేందుకు మేం అందరం సిద్ధంగా ఉన్నాం. సంక్షేమ రథాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి.
గాంధీ మహాత్ముడు కోరిన సుపరిపాలనను జగన్ అందిస్తున్నారు
దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. వీటి గురించి ఎందుకు రాయరని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను నేరుగా పేదవారికి చేరుస్తున్నారు. రైతు మేలు కోసం రైతు భరోసా ఏర్పాటు చేశారు. గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. వాటి గురించి పత్రికల్లో ఎందుకు రాయరు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే నీతివంతమైన పాలన అందిస్తానని చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తానని పేదరికాన్ని పారద్రోలతానని సంక్షేమ ప్రగతి రాష్ట్రాన్ని నిర్మి్స్తానని సీఎం చెప్పారు.
ధర్మాన్ని కాపాడుతున్న సీఎం వైయస్ జగన్ను.. ఆ ధర్మమే కాపాడుతుంది. ఈ రాష్ట్రానికి మళ్లీ కాబోయే సీఎం వైయస్ జగన్ . మీరు గెలిచి తీరాలి. లేకపోతే సంస్కరణలు, వికేంద్రీకరణలు ఆగిపోతాయి. అసమానత్వం తొలగాలి.. పేదరికం పోవాలి.. ఇది జరగాలంటే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలించి.. ప్రజలను కాపాడటం కోసం గెలవాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మనం ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. గడప గడపకూ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని తమ్మినేని సీతారాం అన్నారు.