-రాష్ట్రంలోని ఆర్థిక అవకతవకలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం
-రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే కేంద్రం జోక్యం అవసరం- కనకమేడల రవీంద్రకుమార్
-వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా జగన్ రెడ్డి వ్యవహరం
-వైసీపీ బాధ్యత గుర్తుచేస్తూ మావంతు ఒత్తిడి మేం తీసుకొస్తాం
– కింజరాపు రామ్మోహన్ నాయుడు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు
కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో పాటు ముఖ్యనేతలు పాల్గొన్నారు. సమావేశం వివరాలను కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం ద్వారా తెలియజేయడమైంది.
ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. జూలై 18 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యహాలపై చంద్రబాబు నాయుడు కొన్ని సూచనలు చేశారు. పార్లమెంట్ సెషన్ మొదటి రోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కి టీడీపీ తన మద్దతు తెలియజేసింది. సామాజిక సమీకరణాల్లో భాగంగానే ద్రౌపతి ముర్ము ని బలపరచాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కె.ఆర్. నారాయణన్, అబ్దుల్ కలాం, రామ్ నాధ్ కోవింద్ విషయాల్లో ఏ వైఖరిని అనుసరించామో ద్రౌపది ముర్ము విషయంలో కూడా అనుసరించడం జరిగింది. టీడీపీ నిర్ణయానికి అనుగుణంగా పార్లమెంట్, శాసన సభ్యులంతా పార్లమెంటులో ద్రౌపది ముర్ము కి ఓటేయడం జరుగుతుంది. దీనిని రాజకీయ కోణంలో చూడకుండా సామాజిక ధృక్పథ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ద్రౌపది ముర్ము గారికి టీడీపీ మద్దతును కూడా వక్రీకరించి రాజకీయం చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో వ్యాఖ్యానాలు చేయడం వారి దివాలకోరు రాజకీయాన్ని బయట పెట్టుకోవడమే. ముర్ము వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే.
తెలుగుదేశం పార్టీని కించపరచాలనే ఉద్దేశ్యంతో ఎస్సీ మహిళ పట్ల తీసుకున్న నిర్ణయాన్ని హేళన చేస్తున్నారు. ఎవరైనా కూడ నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తారు, కాని రాజకీయం చేసి వక్రభాష్యం చెప్పడం ద్వారా వాళ్ల రాజకీయ దివాలకోరుతనాన్ని వైసీపీ నాయకులు పైనుంచి కింద వరకు బయట పెట్టుకున్నారు. ఎలాంటి సందేహాలకు, ఏ విధమైనా విమర్శలకు తావివ్వకుండా మేం సామాజిక సమీకరణ ధృక్పథంతో గతంలో అనుసరించిన విధానానికి కొనసాగింపుగా మద్దతు తెలపడం జరిగింది.
రాష్ట్రపతి ఎన్నికతో పాటు పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగింది. 14,15 ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు, పంచాయితీలకు ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపైనా కూలంకుషంగా చర్చించడం జరిగింది. స్థానిక సంస్థల అధికారాలను జగన్ రెడ్డి కాలరాశారు. సర్పంచ్ లకు ఏవిధమైన అధికారాలు లేకుండా చేశారు. చివరకు కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. జగన్ రెడ్డి నిర్ణయాలు అనేకం వివాదాస్పదమవుతున్నాయి. ప్రతి నిర్ణయాన్ని కూడా కోర్టులు తప్పుబడుతున్నాయి. అయినప్పటికీ జగన్ రెడ్డి నైతిక బాధ్యత వహించకపోగా, న్యాయస్థానాల నిర్ణయాల పట్ల నిర్లక్షంగా వ్యవరిస్తున్న తీరు గర్హనీయం. ఇది ఒక రకంగా న్యాయవ్యవస్థను కించపరచడమే.
రాజ్యాంగ సంస్థలను, రాజ్యాంగ అధిపతులను కించపరచే ఉద్దేశంలో భాగంగానే ద్రౌపతి ముర్ము వ్యవహారంలో రాజకీయం చేస్తున్నారు. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను దారి మళ్ళిస్తున్నారు. రాజ్యాంగంలో 73,74 ఎమెండ్ మెంటు ద్వారా పంచాయితీలకు కల్పించిన అధికారాలను నేరుగా తీసేస్తున్నారు. నిధులను దారి మళ్లించి స్వాహా చేస్తున్నారు. నరేగ ఫండ్స్, ఎన్డీఆర్ ఎఫ్ నిధులను కూడా దారి మళ్ళించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జగన్ రెడ్డికి చీవాట్లు పెట్టిన విషయాన్ని గమనించాలి. జగన్ రెడ్డి చేస్తున్న ఆర్థిక అరాచకాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. అప్పులు గురించి ప్రతీ సారి మాట్లాడుతూనే ఉన్నాం, పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లాం.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఖర్చులు విపరీతంగా పెంచేశారు. జగన్ రెడ్డి తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళాలంటే హెలికాఫ్టర్ కావాలి. దావోస్ వెళ్లాంటే వయా లండన్ వెళ్ళాలి. ప్యారిస్ వెళ్లాలంటే స్పెషల్ ఫ్లైట్ కావాలి. అధికారులు, మంత్రులు మెజారిటీ పవర్ ఎంజాయి చేసే వాళ్లు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు పెరిగిపోయిన ధరలతో, ప్రభుత్వం వేస్తున్న పన్నులతో సతమతమవుతున్నారు. ఖర్చులు, అప్పులు పెరిగిపోయాయి. వస్తున్నా ఆదాయం ఏమవుతోంది? ఎంత ఆదాయం వస్తుంది, ఎంత శాతం ఖర్చుపెడుతున్నారు? వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
రాష్ట్ర అప్పు సుమారు 8లక్షల కోట్లు ఉంది. ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ వేలంలో పాల్గొంటే గాని రాష్ట్రంలో పూట గడవని పరిస్థితి. ప్రతి డిపార్టమెంటుకు సంబంధించిన డబ్బులన్నింటిని విత్ డ్రా చేసేస్తున్నారు, చేసి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. వాటికి లెక్కలు లేవు. ఇదేమైనా భారతి సిమెంటు కంపెనీ అనుకుంటున్నారా లెక్కలు లేకపోవడానికి. భారతి సిమెంటు కంపెనీకి పక్కా లెక్కలు ఉన్నాయి.
జగన్ రెడ్డి కంపెనీలు కాని, బినామీ కంపెనీలు కాని, ఆఖరికి లిక్కరు కంపెనీలు కూడా అన్ని లాభాలలో నడుస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం మాత్రం పూర్తిగా దీవాలా తీస్తోంది. ప్రజలను పక్క దారిపట్టింస్తున్నాం అని చెప్తున్నారు. మేము పట్టించడం కాదు వాళ్ళ పార్లమెంటు సభ్యులే స్వయంగా మా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితులలో ఉందని పార్లమెంటులో వేడుకొంటున్నారు. ప్రతి సంవత్సరం ఫండ్స్ రానప్పుడల్లా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధాన మంత్రి గారి మీద ఈ ఒక్క నెలకి పర్మిషన్ ఇవ్వండి అని వేడుకుంటున్నారు. 31 సార్లు ఢిల్లీ పర్యటనలో 4సార్లు ప్రధానమంత్రి గారిని కలిస్తే.. 4సార్లు కూడ ఆర్థిక సంక్షోభం గురించే బతిమాలుకొని, అక్కడ నుంచి నిధులు తెచ్చుకున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
ఎక్కడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. రోడ్ల మరమ్మతులకు ఇవాల్టితో జగన్ రెడ్డి డెడ్ లైన్ పూర్తవుతోంది. ఏ గుంత కూడా పూడ్చిన పాపాన పోలేదు. ప్రశ్నిస్తే ఎల్లో మిడియా అని దాడి చేయడం. మీడియా మీద దాడిచేయడం, మీడియా మిత్రుల స్వేచ్ఛను హరించడం. ప్రతిపక్షాలను తిట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ధైర్యం ఉంటే ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వీటన్నింటిని పార్లమెంట్ లో లేవనెత్తి.. సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. పార్లమెంట్ లో రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కానికి కృషి చేయాలనే చంద్రబాబు నాయుడు ఆదేశాలను సమర్థంగా పాటిస్తాం.
ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. పార్లమెంట్ లో రాష్ట్రం తరపున పోరాడాల్సిన బాధ్యత వైసీపీపై ఉంది. మూడేళ్లలో వైసీపీ తన బాధ్యతల నెరవేర్చలేదు. కేంద్రం నుంచి నిధుల సాధన, విభజన హామీల అమలులో వైసీపీ విఫలమైంది. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారు. హోదా తనవల్లే సాధ్యమని చెప్పిన జగన్ రెడ్డి.. నేడు ఏమయ్యారు?
కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని చెప్పి.. నేడు మోడీ వస్తే సెల్ఫీలు తీసుకునే స్థాయికి వచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏనాడూ రాష్ట్ర సమస్యలపై ప్రశ్నించలేదు. హోదాపై గట్టిగా ఒక్కసారి కూడా అడగలేదు. అడిగితే జగన్ రెడ్డిని అవినీతి కేసుల్లో జైలుకు పంపిస్తారనే భయం. అదైనా ఒప్పుకునే దమ్ము వైసీపీ ఎంపీలకు ఉందా? గతంలో హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని జగన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎందుకు ఆ పని చేయడం లేదు? ఓట్ల కోసమే హోదాను వినియోగించుకున్నారా?
విభజన చట్టంలో హామీలు అమలు విషయంలో జగన్ రెడ్డి నిర్లక్ష్యం వహించారు. జాతీయ విద్యాసంస్థల నిర్మాణాలను పూర్తిచేయలేకపోయారు. రైల్వేజోన్ అంశం ఏమైంది? పోలవరం ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ తో కాలయాపన చేస్తున్నారు. టీడీపీ హయాంలో బ్రహ్మాండంగా పనులు జరిగాయి. ఇప్పుడు ఆగిపోయింది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. నిర్వాసితులను నిర్లక్ష్యం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు పోరాడలేకపోతున్నారు. కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రంలో కొండలను మింగేసి పెద్దఎత్తున వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. కేంద్ర సంస్థలు చర్యలు తీసుకునే అన్ని ఆధారాలు మేం ఇస్తాం. కేంద్రం కూడా వీటికి అప్రూవల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేడు ఏ అనుమతులు లేకుండా అధికారమదంతో కొండలు, గుట్టల్ని మింగేస్తున్నారు. రాష్ట్ర వనరులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం.