దేశంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోనూ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రాష్ట్ర అసెంబ్లీకి తరలి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ముర్ము ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు ఆమెకు టీడీపీ ఘనస్వాగతం పలికింది.
►రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఓటు వేశారు.
► చంద్రబాబు.. తమ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు.#PresidentialElection@ncbn pic.twitter.com/KD2AmcM5xi— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) July 18, 2022