Suryaa.co.in

Family

బూడిద గుమ్మడికాయ త్వరగా కుళ్లిపోతే నరదృష్టి ఉన్నట్టేనా?

దిష్టి గుమ్మడికాయ/తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు, కుంకుమ రాసి దాన్ని సూర్యోదయ సమయంలో ఇంటిముందు ఉట్టిలో వేలాడదీయండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నపుడు దానికి ధూపం చూపించండి. ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది.మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రబావాన్ని అది లాక్కుంటుంది .

ఒకవేళ తరచుగా బూడిద గుమ్మడికాయలు కొద్ది రోజులకే కుల్లిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి. వెంటనే ఆ పాడైపోయినటు వంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి. ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి.

గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు కాబట్టి, గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి. ఇప్పటివరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టేయండి.

LEAVE A RESPONSE