-టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు చిట్టా విప్పిన కేంద్రమంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోన్న అప్పుల చిట్టాను మరోసారి కేంద్రం పార్లమెంట్లో బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం అనుమతించిన అప్పుల్లో 3 నెలల్లోనే ఏపీ సగానికిపైగా రుణాలు తీసుకున్నట్లు వెల్లడించింది. రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరాలు వెల్లడించారు. కేంద్రం, నాబార్డు నుంచి కూడా ఏపీ రుణాలు పొందినట్లు తెలిపారు. తెదేపా ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
2022-23లో నికర రుణ పరిమితి కింద ఏపీకి రూ.44,574 కోట్ల రుణానికి కేంద్రం అనుమతిచ్చింది.మొదటి 9 నెలలకు రూ.40,803 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఉంది. ఏపీ ప్రభుత్వం కేవలం మొదటి 3 నెలల్లోనే 50 శాతానికిపైగా రుణాలు తీసుకున్నట్లు రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ నాటికే రూ.21,890 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి మరో రూ.1,373.47 కోట్లను ఏపీ రుణంగా తీసుకుంది. అప్పు పుట్టిన ప్రతిచోటా ఏపీ రుణాలు తీసుకుంటున్నట్లు కేంద్రం కొసమెరుపుగా పేర్కొంది.