– అనంతపురం జిల్లాలో రజకులపై వైసీపీ నేత దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై జగన్ రెడ్డి అండ్ కో మొదటి నుంచీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పూలకుంటలో రజకులపై వైసీపీ నేత నరసింహారెడ్డి కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. డబ్బులు ఇవ్వకండా బట్టలు ఉతకాలంటూ వేధింపులకు దిగడం అమానుషం. కుల అహంకారంతో నరసింహారెడ్డి వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేత చర్యతో రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత 15 రోజులుగా అతడు వేధిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తక్షణమే నరసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలి. రజకులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.