Suryaa.co.in

Telangana

పాపం.. సుభాష్ విగ్రహం

– చెత్తను ఊడ్చి శుభ్రం చేసిన టీడీపీ నేత కాట్రగడ్డ ప్రసూన
– శ్రమదానంతో సుభాష్ విగ్రహం కళకళ

 

subhash2-1

అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్‌లో ఉన్న సుభాష్‌మార్గ్‌లో ఉన్న సుభాష్‌చంద్రబోస్ పాత విగ్రహం. దాని చుట్టూ అన్నం మెతుకులు, ఇంకా చెత్తా, చెదారం. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు చేసుకుంటున్న శుభవేళ.. సమస యోధుల విగ్రహాలు శుభ్రం చేసి, దెబ్బతిన్న వాటిని సంస్కరించాలన్న స్పృహ అధికారులకు లేకపోవడంతో.. అటుగా వెళుతున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన బృందానికి ఆ దృశ్యం కంటపడింది. దానితో కారు పక్కనపెట్టి, సమీపంలోని షాపులో చీపుర్లు, బకెట్లు కొని శ్రమదానం చేశారు. దానిని చూసిన స్థానికులు కూడా తలో ఓ చేయి వేసి, సుభాష్ విగ్రహాన్ని శుభ్రం చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో కోట్ల రూపాయల పబ్లిసిటీ ఇస్తున్న ప్రభుత్వం, ఈవిధంగా ఆలనాపాలనా లేని ఎన్నో విగ్రహాలను శుభ్రం చేయాలని, వాటికి కొన్ని నిధులు కేటాయించాలన్న సోయ లేకపోవడం దారుణమని ప్రసూన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యదేవ లత, రాంగోపాల్‌పేట డివిజన్ అధ్యక్షుడు రాజు తదితరులు ఈ శ్రమదానంలో పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE