– సెర్ఫ్ సీఈవో మొహమ్మద్ ఇంతియాజ్ అహమ్మద్
దేశాభివృద్ధిలో వైద్యుల పాత్ర ఎన్నదగినదని సెర్ఫ్ సీఈవో మొహమ్మద్ ఇంతియాజ్ అహమ్మద్ పేర్కోన్నారు. అజాదికా అమృత్ మహోత్సవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసొసియేషన్ హల్ లో జరిగిన వేడుకలకు అయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర శాఖ ఆధునీకరించిన ప్రాంగణాన్ని ఐఎంఏ రాష్ట్ర అద్యక్షులు డాక్టరు శ్రీనివాసరాజు ప్రారంభించారు.
జాతీయపతాకాన్ని ఐఎంఏ నగర అధ్యక్షులు డాక్టరు రాసిక్ సంఘవి ఆవిష్కరించారు. ఐఎంఏలో డాక్టర్ల నిపుణుల బృందం రూపొందించిన ఆహార నియమాల పుస్తకాన్ని మొహమ్మద్ ఇంతియాజ్ అహమ్మద్ లాంచనంగా ఆవిష్కరించారు . ఈ సందర్బంగా సెర్ఫ్ సిఇవో మొహమ్మద్ ఇంతియాజ్ అహమ్మద్ మాట్లాడుతూ, మన భారతదేశం ఇప్పటికి అభివృద్ది చెందిన దేశమని, ఇంకా అభివృద్ది సాధించాలింది ఉందన్నారు.
భారత దేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేయాలంటే దేశంలో వివిధ బాధ్యతగల బాద్యులు తమ విధులను సక్రంగా చేస్తే దేశం అన్నిరంగాల్లో ముందుంటుందన్నారు. స్వాతంత్య్రం సిద్దించిన నాటి నుంచి అంతకు మునుపు దేశం కోసం డాక్టర్ల అంకిత భావంతో కూడిన కృషి మర్చిపోలేమన్నారు. రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు మొదటి వరుసలో డాక్టర్లే ఉన్నారన్నారు.
ప్రభుత్వం తీసుకున్న కరోనా కట్టడి చర్యల్లో డాక్టర్ల పాత్ర విలువ కట్టలేని అన్నారు. భవిశ్యత్తులో అన్ని రకాల వైద్య రంగ సవాళ్లకు జవాబుచెప్పేందుకు డాక్టర్లూ సంసిద్దం గా ఉంటారని అయన ప్రకటించారు. వైద్యులు రూపొందించిన శాస్త్రీయ ఆహారానియమాలు అందరూ పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి నందకిశోర్ , నగర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొంగర రవికాంత్ , ఐఎంఏ జాతీయ నాయకులు డాక్టర్ జి .సమరం , డాక్టర్ ఇండ్ల సుబ్బిరామిరెడ్డి , డాక్టర్ సుబాష్ చంద్రబోస్ , డాక్టర్ ఉస్మాన్ , డాక్టర్ కొడాలి రామకృష్ణ , డాక్టర్ తుమ్మల కార్తీక్ , డాక్టర్ టీవీ .రమణమూర్తి , డాక్టర్ కేశవరావు , డాక్టర్ అక్కినేని శివరాం , ఐఎంఏ మహిళా విభాగం నాయకులు డాక్టర్ షాలినీ దేవీ , డాక్టర్ పివి దురుగా రాణి , డాక్టర్ కె .ప్రభాదేవి , డాక్టర్ గిరిజ తదితరులు పాల్గొన్నారు .