– పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం పెరిగిందని గొప్పలు చెప్పుకోడానికి సిగ్గుండాలి
– క్యాబినెట్ సమావేశంలో చర్చించి…మీడియాకు కేసీఆర్ విడుదల చేసిన ప్రకటనపై స్పందించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్ముయ్య….
ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ..
ఏమి చర్చిస్తారో మనకు తెలుసు.ముఖ్యమంత్రి ఎదుట మాట్లాడే ధైర్యం ఉన్న మంత్రులుకాని, ప్రతిపాదనలుకాని, వ్యక్తిగతంగాకాని, అధికారుల నుంచికాని వస్తాయా రావు మనందరికి తెలుసు.సుదీర్గ సమావేశం తరువాత మీడియాకు నోట్ పంపించారు. అది కూడా నేను చూశాను దురదృష్టం…రాష్ట్రంలో ఆదాయం పెరిగిందని కేసీఆర్ సంకలు గుద్దుకుంటున్నారు ఎంత దౌర్భాగ్యం. ఒక వైపు కరోనా రెండు సంవత్సరాలు వచ్చి ఉద్యోగాలు పోయి ఇళ్లలో ఉండే పరిస్థితులు ఉంటే ఆదాయం పెరిగిందని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఏలా చెబుతాయి?ఏలా పెరిగింది ఆదాయం…ఈయన చేసే పనుల వల్ల ప్రజలపై భారం పడకుండా పెరగలేదు కదా?
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగాయి,అత్యధికంగా ఆదాయం మద్యంపై వస్తోంది. మద్యం మీద వచ్చే ఆదాయం సామాన్యులపై నడ్డి విరిగేట్లు వేస్తున్న పన్నుల వల్ల ఆదాయం పెరిగిందని సంకలు గుద్దుకుంటే గొప్పగా చెప్పకుంటే తమ పరిపాలన విశిష్టత అంటే ఏమన్నా అర్థం ఉందా ? ఇది సిగ్గు పడాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వానికి కూడా లక్ష 48వేల కోట్లు పన్నుల రాబడి ….ఇది ఏమైనా సంస్కరణల ద్వారా వచ్చిందా ……కాదు కదా…. దుర్భర పరిస్థితుల్లో పన్నుల ఎక్కువ కావడం వల్ల, రేట్లు పెరగడం వల్ల రవాణా పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో…. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం పెరిగిందని గొప్పలు చెప్పుకోడానికి సిగ్గుండాలి….ఏ కార్యక్రమం చేస్తే పన్ను ఆదాయం పెరిగిందో చెప్పాలి.
అప్పులు తెచ్చారు…అప్పులు తీసుకురావడం వల్ల ఆదాయం వచ్చిందా ?
కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు, పాలమూరు రంగారెడ్డి 40వేల కోట్లల్లో 20వేల కోట్లు అప్పులు తెచ్చారు, యాదాద్రి పవర్ ప్లాంట్‌కు 40వేల కోట్లకు ఇప్పటికే 30వేల కోట్లు అప్పులు తెచ్చారు. అప్పలు తెచ్చినదానిపై ఆదాయం పెరిగిందా…ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు.
ఆదాయం పెరిగిందని..ప్రజలను మభ్య పెట్టడానికి కాకుంటే….దీనిపై వైట్ పేపర్ కావాలి
ఇదికాకుండా మీరేమంటున్నారు ఆసరా పెన్షన్లు….పది లక్షలు…చాలా గొప్పగా ఉంది. అయిదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. మూడు లక్షల 15వేలు ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మేము గతంలో ఇచ్చినవి కూడా రద్దు చేసినావు…ఇప్పుడు మల్లీ అంటున్నావు…ఇది రాజకీయం కోనం కాకుంటే ఏమనాలి…..
అంగన్వాడీ ఉద్యోగాలు అయిదు వేలు భర్తీ ….ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఏదో గొప్పలు చెబుతోంది. ఈ ఒక్క సంవత్సరంలో యిదు వేలు వచ్చాయా …విద్యార్ధుల చదువులు దెబ్బతిన్నాయి కదా ఏ సంవత్సరం ఆ సంవత్సరం పూర్తి చేయాలన్న పరిజ్ఞానం లేదా అయినా మీకెక్కడ…ఆరు నెలలకో…ఏడాదికో ఒకసారి నిద్ర లేచి కళ్లుపులుముకుని ఆహా అని సుదీర్ఘంగా క్యాబినెట్లో చర్చించాలట…. సమీక్షలు చేస్తే చాలు మీ డిపార్టమెంట్లు…. సిగ్గు చేటు కదా? జీవో నంబరు 58,59ల మీద మాట్లాడారు… గతంలోనే ఇచ్చారు కదా । దానికి అప్లికేషన్లు కూడా తీసుకున్నారు కదా…అవి పెండింగ్‌లో ఉన్నాయి కదా…మార్చి 31కి అయ్యింది కదా ఈ విషయాలను చర్చించాలా క్యాబినెట్లో!
ఒక జీవో ఇచ్చినారంటే…పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చినట్లే కదా. దానికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాలి కదా శాఖాపరంగా సమీక్షలు చేయాల్సిన బాధ్యత విశ్మరించి మంత్రులుకాని, ప్రధాన కార్యదర్శికాని, ఆయా శాఖల కార్యదర్శులుకాని శాఖల హెడ్లుకాని సమీక్షలు చేసి నిర్ణయాలు తీసుకుని త్వరగా గ్రౌండ్ చేయాలి.దీనికో క్యాబినెట్ సమావేశం…డిస్కషన్ దానికి ఒక నోట్ అది కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినారని చెప్పడం సిగ్గు చేటు.
అదేవిధంగా ఐటీ జాబ్స్ వచ్చాయని చెబుతున్నారు. వచ్చాయి చాలా సంతోషం. కాని మీరేమి చెబుతున్నారు….రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాల వల్ల వచ్చాయని చెబుతుండడం సిగ్గు చేటు నేను ఎందుకు అంటున్నానంటే…ఈ ఎనిమిది సంవత్సరాలల్లో మీరు ఐటీలో డిపార్టమెంట్ వైజ్ ఎంత డబ్బు కేటాయించారు, ఎన్ని ఇన్సెంటివ్‌లు ఇచ్చారు, ఎన్నికంపెనీలకు ఇచ్చారు, కంపెనీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఆ కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయో చెప్తారా?
గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇన్ ఫ్రాస్టక్సర్ వల్ల గతంలో మేజర్ కంపెనీలు రావడం వల్ల వాటి ఎక్సపెన్షన్ జరుగుతూ ఉంది.ఇన్ఫోసిస్, టీసీఎస్, అమోజాన్, ఫేస్బుక్ లాంటివి ఉన్నాయి…పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. ఇవాళ వాటి సామర్థ్యాన్నిపెంచుకుంటున్నారు.
ఐటీలో దేశంలో బెంగుళూరు తరువాత మనది బాగుందని మొదటి నుంచి ఉంది. అందుకే కదా మేము ఇన్ఫ్రాస్టక్సర్ తయారు చేసింది. వరల్డ్‌లో బెస్ట్ మెట్రో, నంబరు 1 ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?
బిఎస్సీ అయ్యింది…ఎమ్మెస్సీ చేస్తామంటే..సంకలు గుద్దుకంటున్నట్లు ఉంది. ఇంత వరకు చదవింది, ఇంతవరకు వచ్చింది ఎంత అనేదానిపై ఒక వైట్ పేపర్ ఇస్తే మంచిది. మీరు వచ్చిన తరువాత మీరు ప్రోత్సాహకాలు ఎన్నికంపెనీలకు ఇచ్చారు, ఎన్నికంపెనీలు పనులు మొదలు పెట్టాయి. ఆ కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయో… చెబుతారా…ఇది ప్రజలను మభ్యపెట్టడానికే కదా?
అప్పుడో ఇప్పుడో క్యాబినెట్ ఏర్పాటు చేసుకుని సుదీర్ఘంగా చర్చించినట్లు ….మాట్లాడితే ఏలా….చాలా విశ్వాసం కలిగి పట్టుదలతో పని చేసినట్లు చేసే ప్రయత్నాన్ని ప్రజలు ఏలా నమ్ముతారు? ఎఫ్ఆర్ బియం గురించి….ఏమి మాట్లాడతాడు అతి హుసార్…రాష్ట్రం అప్పుల ఊబిలోకి తీసుకెళ్లాడు. ఏదో చెబుతున్నారు…ఆదాయం పెరిగిందని…అప్పుడున్న ఆదాయం ఎంత…ఇప్పుడున్న ఆదాయం ఎంత అప్పుడు చేసిన అప్పులు ఎంత ఇప్పుడు అప్పులు ఎంత?
పంపు హౌస్ లు మునిగిపోయాయి…అక్కడ 25 కోట్లు అవుతుందని అంటున్నారు…వెయ్యి కోట్లు అయినా అవి బాగుకావు…బాగైనా చుక్క నీరు వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం…ఇది ఆయన పరిపాలన..రావయ్యా చర్చిద్దాం. రావు కదా ఇది క్యాబినెట్ నిర్వాహకం…కేసీఆర్ నిర్వాహకం