-సీఎం వర్క్ ఫ్రొమ్ హోమ్ చేస్తారు
-ఏ ప్రభుత్వంలోనైనా ఎక్కువ పని చేసేది టీచర్లే
-మిగిలిన శాఖల అధికారులు టైం కి వస్తున్నారా?
-ఎంపి జీవియల్ నరసింహారావు
విశాఖ: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినందుకు రాష్ట్ర సీఎం క్షమాపణ చెప్పాలి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ఎందుకు డిపిఆర్ పూర్తి చెయ్యలేదు. అన్ని పధకాల లబ్ది దారులకు సమాచారం అందించడానికి త్వరలో బిజెపి కార్యాలయం లోనే ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం.
విశాఖ లో 22 ఏ సెక్షన్ సమస్య ఉంది. 22 ఏ పేరుతో 30 వేల మందికి రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం లేకుండా పోయింది. 15 రోజులో 22 ఏ సెక్షన్ ను తీసేయాలని డిమాండ్ చేస్తున్నాము. 22 ఏ భాదితులకు బీజేపీ అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం టీచర్లు 9 గంటల లోపు యాప్ ద్వార నమోదు చేసు కోవాలని విధానం పెట్టారు.
ఏ ప్రభుత్వంలోనైనా ఎక్కువ పని చేసేది టీచర్లే. మిగిలిన శాఖల అధికారులు టైం కి వస్తున్నారా? మీ మంత్రులు సచివాలయానికి టైం కి వస్తారా? సీఎం వర్క్ ఫ్రొమ్ హోమ్ చేస్తారు. ప్రభుత్వం టీచర్లు పై కక్ష సాధింపు చర్య చేస్తోంది అని అనుమానంగా ఉంది.
లోకసభా పక్ష నేతగా గోరంట్ల మాధవ్ : మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు
రాష్ట్ర ప్రభుత్వానికి టీచర్లు పై ఎంత గౌరవం ఉందో, గతంలో వైన్ షాప్ దగ్గర కాపలా పెట్టినప్పుడే తెలిసింది. గోరంట్ల మాధవ్ ను వైసీపీ లోకసభా పక్ష నేతగా చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. సిట్ రిపోర్ట్ ను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు?