Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు

అమరావతి : హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సస్పెన్షన్ కాలంలో పూర్తి జీతం, అలవెన్స్‌లు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరపగా కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు సార్లు సీఎస్కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి మాత్రమే పూర్తి జీతం ఇచ్చారని.. పాత బకాయిలు చెల్లించలేదని వివరించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ కు 15కు వాయిదా వేసింది.

LEAVE A RESPONSE