గాంధీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయం

– జస్టిస్ ఎన్.వి రమణ

తిరుపతి: ”నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీ నేర్పారు. చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతం” అని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. ”మహాత్మా గాంధీజీ రెండుసార్లు తిరుపతికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1921లో మొదటిసారి, 1933లో రెండోసారి ఆయన తిరుపతికి వచ్చారు” అని జస్టిస్‌ ఎన్.వి.రమణ తెలిపారు.

”ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. చాలావరకు హింసాపూరిత వాతావరణంలోనే సాగాయి. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాడిన విషయం తెలిసిందే. సత్యశోధన పుస్తకం ద్వారా గాంధీని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. గాంధీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయం” అని సీజేఐ తెలిపారు.

తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి నాకు ఆప్తమిత్రుడు, అపూర్వ సహోదరుడు. ఆయన్ను పార్టీలు సరిగా ఉపయోగించుకోలేదు. తెలుగు భాష, సంస్కృతి పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply