ట్విట్టర్ లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు
తాను క్యాంటీన్ లో భోజనం పెడుతున్న ఫోటో ను, వైసీపీ దాడిలో నెత్తుటితో తడిసిన జండా ఫోటో ను కలిపి ట్వీట్ చేసిన చంద్రబాబు. కుప్పంలో కొత్త సంస్కృతి కోసం వైసీపీ విఫలయత్నం చేస్తోంది. దాడులు, కేసులు, వేధింపులతో ప్రశాంత కుప్పంలో కక్ష, ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. దీనిలో కొందరు పోలీసులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
స్వచ్ఛమైన కుప్పంలో ఈ కుళ్ళు రాజకీయాలు నిలబడవని… ఈ చర్యలకు తెలుగుదేశం శ్రేణులు ఏ మాత్రం తడబడవని వైసీపీ నేతలు తెలుసుకోవాలి. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ పై కూడా దాడి చేయాలనే ఆలోచన చేసిన రాజకీయ నేతలు మన దగ్గర అధికారంలో ఉండటం దురదృష్టకరం.
పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న అన్న క్యాంటీన్ పై వైసీపీ గుండాలు దాడి చేస్తుంటే పోలీసులు అడ్డుకోలేకపోవడం చాలా దారుణం. పోలీసు అధికారులు ఇలాగే అచేతనంగా ఉండి పోతే…ఈ వైసీపీ రౌడీ మూక రేపు డీజీపీ ఛాంబర్ లోకి వెళ్లి పోలీస్ బాస్ టోపీ ఎత్తుకువెళ్లినా ఆశ్చర్యం లేదు.