Suryaa.co.in

Andhra Pradesh

వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలను, నిబంధనలను వెంటనే తొలగించాలి

– విజయనగరం పట్టణంలో నిరసనలు

వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలపై వై.సి.పి. ప్రభుత్వం ఇటీవల విధించిన నియమ నిబంధనలను, షరతులను, ఆంక్షలను వెంటనే తొలగించాలి. అని డిమాండ్ చేస్తూ.. విజయనగరం పట్టణంలో గంటస్థంభం జంక్షన్ వద్ద, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర స్వఛ్ఛ భారత్ కో-కన్వీనర్ కుసుమంచి సుబ్బారావు, నార్త్ జోన్ మండల అధ్యక్షులు ఇమంది సుధీర్, ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది.

అనాదిగా ఈ వినాయక చవితి పండుగను బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది అనీ ఇటువంటి పండగలపై ఆంక్షలు పెడితే హిందువులు ఏమాత్రం సహించరనీ తెలియచేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బగ్గాం రాజేష్, శివప్రసాద్ రెడ్డి, బొబ్బిలి శ్రీనివాస్, సోము మహేష్, బూర జగ్గారావు, అబ్దుల్ ఆధిల్, కూర్మారావు, నవీన్, జమ్ము రాంబాబు, శంకర్, శ్రీదేవి, అప్పారావు దొరా, సారిక వెంకటేశ్వరరావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE