-ప్రజల బాగోగుల కన్నా.. బ్యాగుల్లో వచ్చే కరెన్సీపైనే జగన్ దృష్టి
-టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత
ఏపీలో నకిలీ మద్యం వ్యాపారానికి పునాదులు వేసిందే జగన్ రెడ్డి. ఆ విషయం ఎమ్మెల్సీ పోతుల సునీతకు తెలియకపోవడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి మూడేళ్ల పాలన మొత్తం ప్రతిపక్షాలను జేసీబీలతో తొక్కించడం, జగన్-భారతి-కల్తీ బ్రాండ్స్ తో ప్రజల జీబితాలను నాశనం చేస్తున్నారు. ప్రశ్నించిన వారి ఆస్తులపైకి జేసీబీలను పంపించి ధ్వంసం చేయడం, కల్తీ బ్రాండ్స్ తెచ్చి ప్రజల జీవితాలు ఏమైపోయినా కాసులు వెనకేసుకోవడమే ధ్యేయంగా జగన్ రెడ్డి నడుచుకుంటున్నారు.
ప్రపంచంలో ఎక్కడా దొరకని కల్తీ మద్యం ఏపీలోనే ఎందుకు దొరుకుతుందో పోతుల సునీత అనే అద్దె మైకు సమాధానం చెప్పాలి. పేదలకు అన్నం పెట్టి కడుపునింపాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను జగన్ రెడ్డి కక్షతో కూల్చేశారు. చంద్రబాబుపై పగతో అమరావతిని నాశనం చేశారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పనుల్ని నిలిపివేవారు. అలాంటప్పుడు ఏపీలోని డిస్టిలరీలన్నీ చంద్రబాబు తెచ్చినవే అయితే మూడేళ్లుగా ఎందుకు కొనసాగిస్తున్నారో పోతుల సునీత సమాధానం చెప్పాలి.
ఢిల్లీ మధ్యం కుంభకోణంలో జగన్ రెడ్డి భార్య భారతీరెడ్డి పాత్రపై ఇన్ని ఆరోపణలు వచ్చినా సమాధానం చెప్పకుండా.. వారి బురదను చంద్రబాబు కుటుంబానికి అంటించే ప్రయత్నం సిగ్గుచేటు. ఢిల్లీ మధ్యం కేసులో జగన్ రెడ్డికి చెందిన ట్రెడెంట్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీకి డబ్బు అక్రమంగా మళ్లినట్లు వార్తలొచ్చాయి. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు కుటంబంపై బురద వేయాలనుకుంటే తోలుతీస్తాం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దిగమింగిన చరిత్ర జగన్ రెడ్డిది.
క్విడ్ ప్రో కో అనే కొత్త మనీలాండరింగ్ ప్రపంచానికి పరిచయం చేసిన నేరస్తుడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో భారతి రెడ్డి పేరు కూడా ఉంది. ఆ విషయాలన్నీ మరిచి, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా తమ వ్యాపారమేదో తాము చేసుకుంటున్న చంద్రబాబు ఇంటి ఆడవాళ్లపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి విభజన సమస్యలు, ఆర్ధిక లోటు వెంటాడుతున్నా… ఏ రోజు కూడా మద్యం ఆదాయంపై ఆధారపడలేదు. కానీ జగన్ రెడ్డి మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి అదే మద్యం ఆదాయాన్ని తాకట్టు పట్టి రూ.45వేల కోట్లు అప్పుతెచ్చారు. అదే మద్యం ఆదాయమే సంక్షేమ పథకాల అమలు చేయడానికి దిక్కు అని చెప్పి జీవోలిచ్చిన దిక్కుమాలిన చరిత్ర జగన్ రెడ్డిది. ఒకవైపు కల్తీ మద్యం, నాశిరకమైన మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మరోవైపు గంజాయి, డ్రగ్స్ తో రాష్ట్రంలోని యువతను నిర్వీర్యం చేస్తున్నారు.
ఇసుక, మద్యం, మైనింగ్ లో రోజూ మూటలు కట్టి కోటాను కోట్ల డబ్బు తాడేపల్లి ప్యాలస్ కు చేరుతుండడం నిజం కాదా. ఆ డబ్బు మొత్తాన్ని భారతి రెడ్డి ఆధ్వర్యంలోనే హవాలా మార్గంలో ఇతర దేశాలకు తరలిస్తుండడం వాస్తవం కాదా.? ప్రజల ధన, మాన, ప్రాణాలను హరిస్తున్న జగన్ రెడ్డి లాంటి దుర్మార్గమైన వ్యక్తికి వత్తాసు పలకడానికి పోతుల సునీత సిగ్గుపడాలి. జగన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి, రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ గురించి తప్పుగా మాట్లాడితే తోలుతీస్తాం. పోతుల సునీత నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.