-లోకేశ్ కావలి పర్యటనకు ప్రభంజనంలా జనం రావడంతో జీర్ణించుకోలేక వైసీపీ నాయకుల పిచ్చి ప్రేలాపన
– కాకాణి గోవర్థన్ రెడ్డి చేయని దందాలు, భూకబ్జాలు లేవు, రిటైర్డ్ ఎంప్లాయిస్ ప్లాట్లు లాక్కున్నారు
-గోవర్థన్ రెడ్డి అపార్టుమెంట్ లో మైనార్టీ వ్యక్తి చనిపోతే రూ.3లక్షలు ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకున్నది వాస్తవంకాదా?
– కాకాణి గోవర్థన్ రెడ్డికి సంబంధించిన ఫైలు కోర్టులో దొంగలించిన విషయం జగద్వితం
– నిజాయితీగా వ్యవహరించే లోకేశ్ ను విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదు
-టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు
లోకేశ్ కావలి పర్యటనకు ప్రభంజనంలా జనం రావడంతో జీర్ణించుకోలేక వైసీపీ నాయకుల పిచ్చి ప్రేలాపనలు పేలుస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీజీ జాతీయ కార్యాలయంలో ఎంఎస్ రాజు మాట్లాడుతూ… బాధిత దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కావలి పర్యటనకు వెళ్తే వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. జనం ప్రభంజనంలా రావడంతో వైసీపీలో వణుకు పుట్టింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంఘీబావం తెలపడానికి వెల్లువలా వచ్చారు. లోకేష్ తోపాటు పలువురు టీడీపీ శ్రేణులు రోడ్ల మీదకు రావడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కంపరమెత్తించింది. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి, సాంఘీక సంక్షేమ మంత్రి మెరుగ నాగార్జున, కావలి శాసన సభ్యులు ప్రతాప్ రెడ్డి లు ప్రెస్ మీట్ లు పెట్టి కారుకూతలు కూశారు. లోకేశ్ పై దుర్భాషలాడారు. మీడియా సమావేశంలో నీచంగా మాట్లాడారు.
కాకాణి గోవర్ధన రెడ్డి నెల్లూరు జిల్లాలో శాసన సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి సర్వేపల్లి నియోజక వర్గంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన చేయని దందా లేదు, చేయని కబ్జాలు లేవు. దళితుల భూములు ఆక్రమించుకొని వారికి అన్యాయం చేశారు. మాగంటి లేఅవుట్ లో ఫోర్జరీ సంతకాలతో స్థలాలను అమ్ముకున్నారు, రిటైర్డ్ ఉద్యోగుల భూములను బలవంతంగా లాక్కొని రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు. ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ అక్రమ మైనింగ్ జరుగుతుందని విచారణ చేపడితే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారని నివేదికలో వెల్లడైంది. గోవర్థన రెడ్డి మంత్రి అయిన మూడవ రోజే తన అపార్టమెంట్ లో మైనార్టీ యువకుడు చనిపోయాడు. అతని కుటుంబానికి 3లక్షల రూపాయలు ఇచ్చి బెదిరించి తనపై ఆరోపణలు రాకుండా చూశారు. మంత్రి అయిన రెండవ రోజు అతని మీద ఉన్న కేసు తాలుకు ఫైళ్లని దొంగల సాయంతో దొంగలించారు.
ఈ సంఘటనకు సంబంధించి ఆ జిల్లా ఎస్పీ మీడియా సమావేశం పెట్టి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కుక్కులు మోరుగుతూ తరిమేయడం వలన కోర్టులోకి వెళ్లారు. వెళ్లిన తరువాత ఐరన్ దొంగలించే ప్రయత్నం చేశారు. దొరికిన ఫైళ్లని తీసుకెళ్లారని కథ అల్లారు. ఆ ఫైళ్లని దొంగలించటం వలన ఏ దొంగలకు ఉపయోగమో ప్రజలందరికి తెలుసు. ఎస్పీ నిర్ధారించినంత మాత్రాన అసత్యం సత్యంగా మారదు. అవినీతి పోలీసులకు పోస్టింగ్ లు ఇప్పించి వాళ్లతో దుర్మార్గాలు చేయించారు. ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లకి తీసుకెళ్ళి లాఠీ లతో కొట్టించారు. అవసరం అయితే లాకప్ డెత్ చేయించడానికి కూడ వెనకాడటం లేదు. ఇది కాకాణి గోవర్థన రెడ్డి చరిత్ర. ఇటువంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి నిజాయితితో రాజకీయాలలో వ్యవహరిస్తున్న యువనేత నారా లోకేష్ గురించి విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. రోడ్డుపైకి రావాలంటే జగన్ కు వేల పోలీసులు కావాలి, లోకేశ్ కు అలాంటి అవసరం లేదు.
నారా లోకేష్ భాష మార్చుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడంకాదు ముందు తను భాష మార్చుకోవాలి. వారి శాసన సభ్యులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, కొడాలి నానిల భాష పరమ చండాలంగా ఉంటోంది. ఇదంతా గోవర్ధన్ రెడ్డికి కనిపించడం లేదా? చంద్రబాబు నాయుడును అవినీతి పరుడని మాట్లాడిన మీ భాష ప్రజలు మన్నన పొందే భాషా? లోకేష్ ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడుతారు. ఆయన భాషలో ఏమీ తప్పులేదు. వైసీపీ నాయకులు మాట్లాడే భాషా విధానాన్ని చూడలేక టీవీలు కట్టేసుకునే దౌర్భాగ్య పరిస్ధితి. బూతులు మాట్లాడే విధానాన్ని రాజకీయంలోకి తెచ్చింది వైసీపీ నాయకులు.
తెలుగుదేశం పార్టీ నాయకులు వాటిని తిప్పి కుట్టేందుకు పరుష పదజాలాన్ని ఉపయోగించాల్సి వస్తోంది.
లోకేష్ పర్యటనలో జనం ప్రభంజనంలా వచ్చారు. అది చూసి విమర్శించేందుకు జగన్ రెడ్డి నేతృత్వంలో నిన్న మంత్రుల కేబినెట్ మీటింగ్ లో జగన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ లను తిట్టకపోతే మంత్రి పదవిని మారుస్తాం అని స్పష్టంగా చెప్పారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచి హత్యలు, అత్యాచారాలు అధికమయ్యాయి. దుగ్గిరాల కరుణాకర్ అనే దళితుల పై హత్యలు, మహిళలపై అత్యాచారాలు అనేకం జరుగుతున్నా ఏ రోజు నోరు విప్పని దళిత మంత్రి మేరుగ నాగార్జున. ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం ఆ కుంటుంబాన్ని వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించలేదు. ఏ ఒక్క దళిత మహిళ పై అత్యాచారం, హత్యా జరిగినా పరామర్శించని మేరుగ నాగార్జునకు లోకేష్ గురించి మాట్లాడే హక్కు లేదు. తెలిసి తెలిసి పేదరికం, అణచివేతలో పుట్టాలనుకోరు అనే రీతిలో చంద్రబాబు నాయుడు మాట్లాడితే దాన్ని వక్రీకరించి ఎస్సీ,ఎస్టీల్లో పుట్టాలని ఎవరు కోరు అని మాట్లాడినట్లు మాట్లాడటం జరిగింది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు వెనకాల వైసీపీ ప్రస్తుత ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ఉన్నారు.
నిజంగా దళితులని అమానపరిచే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడివుంటే జూపూడి ప్రభాకర్ ఎందుకు మాట్లాడలేదు? ఎంతో మంది మహిళల తాళిబొట్లు తెంచిన నీచ చరిత్ర కలిగిన వ్యక్తి రాజారెడ్డి. అలాంటి వారి గురించి, మహిళల హక్కులు, మాన, ప్రాణాల కోసం నిరంతరం పోరాటం చేసే లోకేష్ కి అలాంటి నీచుడు గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేష్ కు లేదు. ఫ్యాక్షనిస్టుగా మైనింగ్ యాజమాన్యాన్ని చంపి మైనింగ్ లని స్వాధీనం చేసుకున్న దుర్మార్గుల రక్త చరిత్ర కలిగిన వారి గురించి రక్త చరిత్ర ఏంటో తెలియని కుంటుంబంలోని లోకేష్ గారు మాట్లాడకూడదు. వైసీపీ నాయకులు అసెంబ్లీలో మాట్లాడే భాషను చూసి జనం టీవీలు కట్టేస్తుకుంటున్నారు. విమర్శించకపోతే మంత్రి పదవులు మారుస్తామని జగన్ బెదిరించడంతో కుక్కల్లా మొరుగుతున్నారు. దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా దళిత మంత్రి మేరుగ నాగార్జున ఏంచేస్తున్నాడు? రాజారారెడ్డి లాంటి రక్తచరిత్ర లోకేశ్ కు లేదు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేశ్ రెడ్డి, సుకుమార్ రెడ్డిల దుర్మార్గాలకు చనిపోయిన వ్యక్తి లేఖ రాసి చనిపోతే చర్యలు శూన్యం. వైసీపీ దురాగతాలకు కరుణాకర్ మరణించినందువల్లే కావలి ప్రజలు లోకేశ్ కు మద్దతిచ్చారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిందెవరో కాకాణి తన నాయకుడు జగన్ ను అడిగి తెలుసుకోవాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు తెలిపారు.