– మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
బడుగులను బ్రతకనివ్వండి ప్రజాస్వామ్యన్ని కాపాడండి అనే నినాదంతో నిరవధిక నిరాహర దీక్ష చేస్తున్న పామర్రు నియోజకవర్గ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా దీక్షకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి,మాజీ శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య .
ఈ సందర్భంలో తాతయ్య మాట్లాడుతూ వర్ల కుమార్ రాజా దీక్షకు పూనుకొని నేటికీ మూడు రోజులు అవ్వటం వలన ఆరోగ్యం క్షీణించడం మొదలైందని, అయినా కానీ ప్రభుత్వం వారి నుండి స్పందన రాకపోవటం దారుణమని, రాజా ఆరోగ్య పరిస్థితి చూస్తూ ఉంటే టీడీపీ శ్రేణులలో ఆందోళనకు గురివుతున్నారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను దళితులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని అధికారం వచ్చిన తర్వాత వారిని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తోందని, ఇదేవిధంగా చేస్తూ పోతే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలు సరైన బుద్ధి చెప్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తంగిరాల సౌమ్య, అంగన్వాడీ,డ్వాక్రా సాధికారిక సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, 9వ వార్డ్ కౌన్సిలర్ పేరం సైదేశ్వర రావు , తాండవ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.