Suryaa.co.in

Andhra Pradesh

వర్ల కుమార్ రాజాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్

అమరావతి:- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వర్ల కుమార్ రాజా ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. బడుగులను బతకనివ్వండి -ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ మూడు రోజులుగా కుమార్ రాజా చేస్తున్న నిరాహార దీక్షను పోలీస్ లు భగ్నం చేసి మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ సందర్భంగా వర్ల కుమార్ రాజా ను చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. పోలీసులు అరెస్ట్ చేసిన తీరుకు ఖండించారు. బడుగు వర్గాలపై దాడులకు వ్యతిరేకంగా కుమార్ రాజా చేపట్టిన పోరాటాన్ని అభినందించారు. ఈతరహా పోరాటాలతో ప్రజల్లో చైతన్యం తేవడం తో పాటు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావొచ్చు అని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.

LEAVE A RESPONSE