• అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్భాలు
• మూడున్నరేళ్లుగా విభజన హామీల సాధనకు పాతరేసిన జగన్ రెడ్డి
• 25 మంది ఎంపీలిస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు.. నేడు 32 మంది ఎంపీలుండీ సాధించింది శూన్యం
• విభజన హామీల అమలు నుండి.. అమరావతి నిర్మాణం వరకు అన్నింటా ప్రజలకు జగన్ రెడ్డి పంగనామాలు
-టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ వ్యవహారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే చేస్తున్నామని, గోప్యత ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజల్ని మభ్యబెట్టాలనుకోవడం దుర్మార్గమని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు జూమ్ వీడియో సమావేశం ద్వారా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆయన మాటలు యథాతథంగా….విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న పేరుతో సాధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తుంటే దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచి సెయిల్ లో కలపడమా, సొంతంగా ఆదుకోవడమా, రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడమా, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కోరి ఉన్న స్ధితిని కొనసాగించడమా అనే ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ప్రైవేటు పరం చేస్తుంటే కళ్లప్పచెప్పి చూస్తూ సహకరిస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణకు మేం వ్యతరేకమని కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.
మరోవైపు విశాఖపట్నం రైల్వే జోన్ కు సంబంధించి వైసీపీ నాయకులు పూటకో మాట చెబుతున్నారు. రైల్వే జోన్ విషయంలో ఎందుకు ఎందుకు నిలదీయడం లేదు.? రైల్వే జోన్ విషయంలో ఎంత ఉదారతతో ఉన్నారనే ప్రశ్న ఎందుకు వేయడం లేదు.? రైల్వే జోన్ సాదనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే విశాఖకు శాపంగా మారుతున్న విషయాన్ని కప్పిపెట్టేందుకు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు.
విభజన హామీలు, ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థలు, హక్కులు, ఆస్తులు విభజనపై కేంద్రం చొరవ తీసుకొని రెండు రాష్ట్రాలకు చేయాల్సిన న్యాయం ఇంత వరకు చేయడం లేదు. హోం శాఖ సమావేశాలు కూడా జరిగాయి. ఫలితం శూన్యం. హోం శాఖ 14 అంశాలపై చర్చలు జరిపింది. ఏపికి సంబంధించిన అధికారులు స్పష్టత ఇచ్చారా లేదా. జగన్ రెడ్డి ప్రభుత్వ ఉద్ధేశం ఏంటి? రైల్వే బోర్డు వారు రైల్వే జోన్ సాధ్యం కాదని హోం శాఖ సమావేశంలో వెల్లడించింది. దానిపై హోం శాఖ సెక్రటరీ ఎందుకు సాధ్యం కావడవలేదని నిలదీయడం జరిగింది. దానికి జగన్ రెడ్డి సమాధానం చెప్పే పరిస్ధితులలో లేరు. విశాఖ రైల్వేజోన్ లాభదాయకం కాదని, సమగ్రమైన డీపీఆర్ ఇంకా ఇవ్వలేదని కేంద్రం చెబుతుంది.
టీడీపీ తరుపున రాజ్యసభ వేదికగా నేను విభజన హామిల గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తాను. విభజన హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నలకు వచ్చిన సమాధానం మెజార్టీ సమస్యలలో రాష్ట్రప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంతో చేసే ప్రాజెక్టులకి సబంధించి ఏపీ వాటా చెల్లించడం లేదు. అందువల్ల ప్రాజెక్టులలో పురోగతి లేదు. 7 ప్రాజెక్టులకి సబంధించి రాష్ట్ర ప్రభుత్వం కనీస డిపాజిట్ చేయలేదు. ఇండస్ట్రియల్ కారిడార్, నేషనల్ హైవే, రోడ్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జ్, ఇతర రోడ్లు ప్రాజెక్ట్ లకు సంబంధించి భూసేకరణలో పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి శ్రద్ధ చూపించకపోవడంతో అడుగు ముందుకు వేయలేకపోతున్నాం అని కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కూడ ఇదే విధమైన సమాధానాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ సమాధానాలతో అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీలు అమలుకు సహకరించడం లేదని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు హయాంలో అనేక విద్యాసంస్థలను తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా పోరాడి విభజన హక్కుల్ని సాధించుకున్నాం. విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? రైల్వే జోన్ స్థలం ఎంపిక విషయంలోను జగన్మోహన్ రెడ్డి మభ్య పెట్టారు. జోన్ విషయంలో ఎనిమిదన్నరేళ్లగా జరుగుతున్నదేంటని రాష్ట్రం ఎందుకు స్పష్టత తీసుకోవడం లేదో వారే సమాధానం చెప్పాలి.
సుస్థిరమైన అమరావతి రాజధానిని మూడు రాజధానుల పేరుతో అస్థిరపరిచారు. చంద్రబాబు అభివృద్ధి పాలనకు ఆటంకం కలిగారు. రాజధాని నిర్మాణానికి రూ.29వేల కోట్లు ఇవ్వమని అడగడం అమరావతిపై కక్షసాధింపు చర్యలకు ప్రత్యక్ష నిదర్శనం. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రత్యేకహోదా ఏపీకి సంజీవని అన్నారు. 25 ఎంపీలిస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామన్నారు. నేడు 31 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడలేకపోతున్నారు? ప్రత్యేకహోదా గురించి తీసుకున్న స్టాండ్ ఏంటి? కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ప్రభుత్వం ఫాం చేసుకుంది కాబట్టి కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నామని జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి, మడమ తిప్పారు. హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాలని నాడు జగన్ రెడ్డి డిమాండ్ చేశారు. మాకు రాజకీయంగా నష్టమైనా రాష్ట్రం కోసం కేంద్రం నుంచి భయటకు వచ్చి పోరాడాం. కానీ నేడు ఏం చేస్తున్నారు? కేంద్రం మెడలు వంచుతామన్న వారే మెడలు వంచుతున్నారు.
ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విభజన హామీలు, వెనకబడిన జిల్లాల నిధులు రావడం లేదు, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో వాటాలు తగ్గిపోయాయి. ఏపీకి డబ్బులు ఇస్తామంటే తీసుకోవడం లేదు, కేంద్ర పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తంగా ఉందని కేంద్ర మంత్రి నారాయణ స్వామి అన్నారు. 7 వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ గురించి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు, కేంద్ర విద్యా సంస్థలకు నిధుల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారు? షెడ్యూల్ 9, 10 ఆస్తులకు సంబంధించి లక్షా 92వేల కోట్లు పెండింగులో ఉన్నాయి. 11వ షెడ్యూల్ ప్రకారం నదీ యాజమాన్య మండలి ఏమైందో తెలియదు? ఢిల్లీలో ఆస్తుల విభజన ఇంకా తేలలేదు. పన్నులు విధించే విషయంలో వ్యత్యాసాలు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రానికి రూ.3,820 కోట్లు నష్టాన్ని పట్టించుకోవడం లేదు. విద్యుత్ బకాయిలను కోరడం లేదు. వాటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?
ఫైనాన్స్ మీటింగ్ లో 11 కొర్రీలు వేస్తే వాటికి సమాధానం చెప్పకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయటకు వచ్చి పచ్చి అబద్దాలు చెప్పారు. లోపల జరిగింది ఒకటైతే బయట చెప్పింది ఇంకోటి. మేము అధికారంలో ఉన్నంత కాలం ఏం జరిగిందో, ఏం చేశామో ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాం. కాని మీరు చేస్తున్నదేంటో, జరుగుతున్నదేంటో ప్రజలకు తెలియకుండ చేస్తున్నారు. విభజన హామీల సాధన విషయంలో జగన్ రెడ్డి కనీసం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా రాష్ట్ర ప్రజల్ని నిండా ముంచుతున్నారు.
చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టులో 71 శాతం పనులు పూర్తి చేస్తే, జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. అంచనాలు పెంచి దోచుకుంటున్నారంటూ ప్రతిపక్షంలో లేఖలు రాయడంతో ఆ లేఖలే నేడు వారి మెడకు చుట్టుకున్నాయి. రాజధాని విషయంలో డీపీఆర్ ఇవ్వకుండా నిదులు ఇవ్వాలంటున్నారు. అలా చేస్తే నిధులు ఎలా ఇస్తారు? ఏపీ రాజధాని ఎక్కడో చెప్పుకోలేని దుస్థితిలోకి రాష్ట్రాన్ని, ప్రజల్ని నెట్టి రాజధాని కోసం నిధులివ్వమని కేంద్రాన్ని కోరడం సిగ్గుమాలినతనం.
రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు కిమ్మనకుండా కూర్చున్న వారు, వివేకానంద రెడ్డి హత్య, ఈడీ, సీబీఐ కేసుల్లో కదలికలు వచ్చినప్పుడు హడావుడిగా ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుంటున్నారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు అక్రమార్జన చేశారు కాబట్టే అన్ని సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ-1గా ఉన్నారు. ఈ రోజు కూడా సీబీఐ, ఈడీ అంటే వణుకుతున్నారు. అధికారాన్ని, డబ్బు బలాన్ని అడ్డం పెట్టుకుని కేసుల విచారణ ముందుకు సాగకుండా డిశార్జ్ పిటీషన్లతో అడ్డుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తన కేసుల మాఫీ కోసమే ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రులను కలుస్తున్నారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విభజన హామీల అమలులో భాగంగా వచ్చిన నిధులెంత? సాధించిందేమిటి? అసమర్ధత వలనే పోలవరం సర్వనాశనం అయ్యిందని కేంద్రం నియమించిన సంస్థ నివేదికలో భయటపడింది. పక్క రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రితో మీరు సోదరభావంతో వెలుగొందారు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్ముకుంటే ఏపీలో నాలుగు ఎకరాలు కొనుక్కోవచ్చని అంటుంటే మీకు సిగ్గుగా అనిపించడం లేదా? ప్రజల జీవితాలు అస్తవ్యస్థమయ్యాయని, వసలలు పెరుగుతున్నాయని పొరుగు రాష్ట్ర నేతలు ఏపీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తుంటే వినిపించడం లేదా? రాజధాని రైతులు చేసే పాదయాత్రను దండయాత్రగా చిత్రీకరించి అసెంబ్లీ వేదికగా ఉత్తరాంధ్ర మంత్రుతో ప్రాంతాల వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు.
నిరాయుధులైన ప్రజలపై ఆయుధాలతో పోలీసులను పంపించి మీ ప్రతాపం చూపించడం సిగ్గుచేటు. మీ ప్రతిభ, సామర్ధ్యం కేంద్ర ప్రభుత్వం మీద ఉపయోగించండి. చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపండి. ఆర్ధిక పరిస్థితి బాగోలేదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి చెబుతారు? అంతా బాగుందని జగన్మోహన్ రెడ్డి చెబుతారు. పాలనలో పారదర్శకత లోపించింది. జీవోలను ఆన్ లైన్ లో ఉంచరు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో ఏం మాట్లాడారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. అప్పులు, ఆదాయాలు, ఖర్చుల లెక్కలు బయట పెట్టేందుకు వణుకుతున్నారు.
పొద్దున్న నిద్ర లేచినప్పటి నుండి చంద్రబాబు నాయుడు జపం తప్ప రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో జగన్ ఉన్నారు. మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క రోడ్లు వేయలేదు. అభివృద్ధి లేదు. అయినా లక్షల కోట్ల బడ్జెట్, లక్షల కోట్ల ఆదాయం, వేల కోట్ల మద్యం ఆదాయం ఏమవుతోంది? చంద్రబాబు 5 ఏళ్లల్లో రాజధాని కట్టలేదు, ఆయన మీద 420 కేసు పెట్టాలని జగన్ రెడ్డి అంటున్నారు. మరి మీ మీద ఎన్ని 420 కేసులు పెట్టాలి? కేంద్రం నుంచి విభజన హామీలు, ప్రత్యేకహోదా, రైల్వేజోన్ సహా ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు. అంతెందుకు సొంత జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న కడప స్టీల్ ప్లాంట్ పత్తా లేదు. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ గ్రాఫిక్స్ దాటి ముందుకు వెళ్లలేదు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హామీలు అమలు కోసం కేంద్రంతో పోరాడేందుకు అవసరమైతే తెలుగుదేశం పార్టీ కూడా మద్దతిస్తుంది. అంతేగానీ లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం దుర్మార్గం. అందుకే మూడున్నరేళ్లలో కూడా ఏమ సాధించుకోలేకపోయారు. గొంతెత్తిన వారి గొంతు నులిమి జైళ్లల్లో పెట్టడంతో మీ పాలన ఏంటో అర్ధమైపోయింది.