– టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో నెం 1.. నేడు గంజాయి అక్రమ రవాణాలో నెం.1
• దేశంలో ఏ ప్రాంతంలోనైనా అక్రమ రవాణాలో మత్తు పదార్థాలు పట్టుబడ్డా మూలాలు ఆంధ్రాలో ఉంటున్నాయి
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి
ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులు వంటి వాటిలో ఏపీ నెం 1 స్ధానంలో ఉండి ఎన్నో అవార్డులు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ నేడు గంజాయి అక్రమ రవాణా విషయంలో నెం.1 స్థానంలో ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడిన మాటలు యథాతథంగా….
ప్రతిరోజు గంజాయి దొంగ రవాణా, డ్రగ్స్, మాఫియా వార్తలే పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు దేశం మొత్తానికి బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ నేడు జగన్ రెడ్డి పాలనలో దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేస్తూ గంజాయిప్రదేశ్ గా మారింది. గంజాయి అక్రమ రవాణాలో ఏపీ మొదటి స్ధానంలో ఉందని, ఏపీలో దొరికినంత గంజాయి దేశంలో మరే ఇతర రాష్ట్రంలో దొరకలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నివేదిక 2021 వెల్లడించింది. 2021లో దేశ వ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయి పట్టుబడితే అందులో 2,00,588 కిలోలు మన రాష్ట్రంలోనే పట్టుబడింది. దేశంలో పట్టుబడ్డ గంజాయిలో సగం ఏపీ, ఒడిషా ఈ రెండు రాష్ట్రాల్లోనే పట్టుబడింది.
పట్టుబడ్డ గంజాయి కేజీలు 2,00,588 కేజీ రూ. 27 వేలు చొప్పున లెక్కిస్తే 5,415,876,000 . అంటే పట్టుబడిన గంజాయి విలువ రూ. 5400 కోట్లు. ఇంకా పట్టుబడకుండా అక్రమ రవాణా జరుగుతున్న గంజాయి విలువ ఎన్ని వేల కోట్లుంటుందో? రోజుకూ వేల టన్నుల్లో గంజాయి రాష్ట్రం నుంచి రవాణా జరుగుతంటే కేవలం 1775 కేసులు మాత్రమే నమోదయ్యాయంటే గంజాయి మాఫియాకు వైసీపీ పెద్దలు ఏవిధంగా సహకరిస్తున్నారో స్పష్టమవుతోంది. రుషికొండ బోడికొండ అవుతున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ తరలిపోతున్నా వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. వైసీపీ నాయకుల ఇళ్లల్లో, కార్లల్లో గంజాయి దొరుకున్నా పట్టించుకోవడంలేదు. అక్రమ రవాణాలో 7లక్షల కిలోల గంజాయి పట్టుబడితే అందులో దాదాపు 2లక్షల కిలోల మన ఆంధ్రప్రదేశ్ లోనే పట్టుబడింది.
ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకేముంది. చాలా మంది వైసీపీ మంత్రులు ముఖ్యమంత్రి తమ పదవులని ఎక్కడ తీసేస్తారో అనే భయంతో ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్ధం కాకుండా మాట్లాడుతున్నారు. గతంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే వాటి గురించి ప్రజలు గొప్పగా చెప్పుకునే వారు. నేడు అభివృద్థి కార్యక్రమాల గురించి కాకుండా మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి మాట్లాడుకుంటున్నారు. యువతను అన్ని విధాల నాశనం చేస్తున్న ప్రభుత్వం జగన్ ది. దేశంలో ఏ ప్రాంతంలో గంజాయి పట్టుబడ్డ వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి రోజుకు వేల టన్నులలో గంజాయి రవాణా జరుగుతున్నా కేవలం 1700 కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
ముఖ్యంగా ఒరిస్సా సరిహద్దుల నుంచి ఉత్తారాంధ్ర నుంచి ఎక్కువగా రవాణా సాగుతుందని వార్తలు వస్తున్నాయి. కాని ఉత్తారాంధ్రలోని మంత్రులు, ఎమ్మెల్యేలు వాటి గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. గంజాయి రవాణా జరుగుతున్నా పట్టించుకోరు. విశాఖ నుంచి స్టీల్ ప్లాంటు తరలి వెళ్తున్నా ఆలోచించడం లేదు. రుషి కొండ బోడి కొండ అవుతున్నా పట్టనట్టు ఉంటున్నారు.
ఇంత జరుగుతున్నా పట్టించుకోరు కాని రైతులు పాదయాత్ర చేస్తే అడ్డంకులు సృష్టించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ రాజధాని ఎందుకు కట్టకోడదని తలాతోక లేని ప్రశ్నలను సంధిస్తుంటారు. నేడు యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు.
స్వయాన ప్రజాప్రతినిధుల కార్లలో మత్తు పదార్ధాలు పట్టుబడుతున్నా ప్రభుత్వం అడ్డుకోవడం కాని శిక్షించడం కాని చేయడం లేదు. ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మత్తు పదార్ధాలకు బానిసలని చేసి వాళ్లని నిర్వీర్యం చేస్తుంది. ఉత్తరాంధ్ర ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వేల టన్నులలో గంజాయి రవాణా జరిగి పట్టుబడుతున్నా ఒక్కరోజైనా ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశం జరిపించిందా? ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెడుతున్నప్పుడు బాధ్యత గల మంత్రులుగా ఏనాడైనా రౌండు టేబుల్ సమావేశం పెట్టారా? ఆఖరికి మహిళల మీద దాడులు జరుగుతుంటే సమావేశం పెట్టారా?
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే స్టీల్ ప్లాంటు వెళిపోతున్నా రౌండు టేబుల్ సమావేశాలు పెట్టలేదు. నేడు జగన్ రెడ్డి మీరు మాట్లాడకపోతే మీ పదవులు పోతాయి అని అనడంతో తూతూ మంత్రంగా నోటికొచ్చినట్టు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడారు. ఇటువంటి నాయకులకు రానున్న రోజులలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండు కళ్ళుగా ముందుకు సాగేవి. మత్తు పదార్థాలను నిర్మూలించడానికి నిరంతరం కృషి చేశారు. అక్రమ రవాణాను అడ్డుకొని పునరావృతం కాకుండా చేశారు. రాజకీయ నాయకులు అంటే ఇలా ఉంటారా అనే రీతిలో వైసీపీ వాళ్లు ఉంటున్నారు. వాళ్ల తీరుని చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. వైసీపీ ఎంపీలు చేస్తున్న వెకిలి చేష్టలు, కొంత మంది చేస్తున్న దొంగ రవాణా, మహిళా నాయకులు సంస్కారం లేకుండా మాట్లాడే పదజాలం ప్రపంచ వ్యాప్తంగా సిగ్గుతో తల దించుకునే పరిస్ధితిని తీసుకుస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసి జగన్ రెడ్డికి బుద్ధి చెప్తారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.