రీసైక్లింగ్ ఊతమివ్వటమా?
పండుగ సెలవులలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని యువచనలో ప్రైవేటు బస్సులు టికెట్ ఛార్జ్ పెంచుతుంటే…. రైల్వే శాఖ ప్లాట్ ఫారం టికెట్టు ధర పెంచుతున్నది. రైల్వే శాఖ తాజాగా శనివారం తెల్లవారుజాము నుంచి పది రూపాయల చార్జిని ఏకంగా 30 లకు పెంచేసింది. ఈ పెంపు ఈ నెల 9వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. దీనివల్ల టికెట్ రీసైకిలింగ్ కు దారి చూపినట్లు అవుతుందని రైల్వే ఉద్యోగులు భయపడుతున్నారు. సాధారణంగా ప్లాట్ ఫారం టికెట్ రెండు గంటల పాటు పనిచేస్తుంది. అదే ప్యాసింజర్ రైలుకు కనీస చార్జి అంటే సమీప స్టేషన్ కు 10 ల చార్జీ…. 30 లతో ప్లాట్ ఫారం టికెట్టు కు బదులు 10 లతో రైలు టికెట్ తీసుకుంటే కనీసం 12 గంటల పాటు రైల్వే స్టేషన్లో ఉండవచ్చు లేదా క్యూ లైన్ లో ఉన్న వారికి ఉచితంగా ఇచ్చి వెళ్లవచ్చు. ఇలా రోజంతా రీసైకిలింగ్ కు అవకాశం ఉంటుందని ప్రచారం సాగుతున్నది.
అసలు ఇంతకీ ఈ పెంపునకు కారణం ఏమిటంటే దాదాపు పది ఏళ్ల క్రితం ఎక్కడో స్టేషన్ లో రైలు ఎక్కించడానికి వచ్చిన వారితో ఫ్లైఓవర్ కిటకిటలాడి విరిగిపోగా పలువురు మరణించారు. దీంతో ప్లాట్ఫారం టికెట్ ధర పెంపుతో వీడ్కోలు చెప్పడానికి వచ్చేవారిని తగ్గించవచ్చు అన్నది రైల్వే ఉన్నతాధికారుల యోచన.
– నిమ్మ రాజు చలపతిరావు,
సీనియర్ జర్నలిస్ట్