Suryaa.co.in

Entertainment

కృయాల్టీ షో..!

ఒక అస్తవ్యస్త ప్రదర్శన..
నిలువెల్లా నిరసన..
ఓ చానల్లో
ప్రదర్శితమవుతున్న
షో..
ఇళ్లలో షోలే..
ఈ షో అంటే చాలు ఇక లే..!

క్రికెట్ నచ్చని వారు చేసే
ఓ కామెంట్..
ఈ సందర్భంగా ప్రస్తావనార్హం..
cricket is a game played by 22 idiots and watched by thousands
of fools..అని
అలాగే ..
BIGLOSS
21 మందికి
అర్థం లేని పూనకం ????
ప్రేక్షకులకు 30 ఎపిసోడ్ల
అర్థం కాని నరకం..
అనర్థం..
ఖాళీగా ఉండే
కొంతమందిని
ఏరుకొచ్చి..
వారికి సెలబ్రిటీస్
అనే భుజకీర్తిని తగిలించి..
105 రోజులు..
21 మంది contestants..
BIGGEST REALITY SHOW అని బిల్డప్ ఇచ్చి మనపై రుద్దుతున్న
ఓ హర్రర్ షో..
టెర్రర్ ఎక్స్ పో..!

అసలు ఈ షో
ఉద్దేశం ఏమిటి..
వినోదమా..
వివాదమా..
రెండూ కలగలిపిన విషాదమా..,!?
హిందూ..భారతీయ సంప్రదాయాలను
మంట గలుపుతూ
ఒకే చోట ఆడామగలను
ఉంచి వారు
ఏం చేస్తున్నారో
వారికి గాని..
మనకు గాని
అర్థం కాని రీతిలో తైతక్కలాడించి
ఒక తీరు.. తెన్ను లేక
పద్ధతి పాడు ఉండక..
ఎంతకీ తెంచక..
మధ్యమధ్యలో సూట్ వేసుకుని ఒకాయన రామాయణంలో
పిడకల వేట కానిచ్చి..
ఇంకాస్త బిల్డప్పిచ్చి..
మనలో లేని ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసి..
అప్పటికే నశించిన ఓర్పును మరింతగా చంపి..
జుగుప్స పెంచి..
ఒక టివి షో చూస్తున్నామనే భ్రాంతిని వాంతిగా మార్చి
మనశ్శాంతిని
హరించి వెళ్తాడు..
ఆయనే సమర్పకుడు..సందర్శకుడు..
విమర్శకుడు..
ఈ షో వరకు మాత్రం
భీతావహుడు..!
స్థాయికి తగని పని..
మెదళ్ళకు గ్లాని..
మన మొదళ్ళకే హాని..
ఓ విషాద కహానీ..!

లోపల వారి గెటప్పులు..
సెటప్పులు..స్టెప్పులు..
ఇవేవీ ఉడకని పప్పులు..
ముప్పులు..అన్నీ తప్పులు..
ఇవి ప్రేక్షకులపై
కరుణ చూపని
కృయాల్టీ షోలా..
అయిపోమా డీలా..
అక్కడ కనిపిస్తున్న
ప్రతి ఒక్కరిలో
అగుపిస్తున్న షకీలా..
మరీ అంత వెకిలా..
మగాళ్లంతా మంకీలా..
ఇలాంటి షోలతో
ఇస్తున్న సందేశం ఏంటి..
సంప్రదాయాలకు తిలోదకాలా..
విలువలతో పరాచికాలా..!
కోర్టు మందలించినా
ఆగదా ఈ భీకర క్రతువు..
అశ్లీలతకు హేతువు..!

క్రికెట్..హాకీ..టెన్నిస్ వంటి ఆటలతో వినోదం..
కౌన్ బానేగా కరోర్పతితో విజ్ఞానం..
ఈ తరహా కృయాల్టీ షోలతో
విలువల పతనం..
దుస్సంప్రదాయాల పెత్తనం..
అనర్హులకు సెలబ్రిటీస్
అంటూ వాయనం..
మన సంస్కృతీ సంప్రదాయాల నుంచి మరింతగా పలాయనం..!?
మన్మధా..
తగునా
నీకు ఈ తరహా వధా..
శరణం నాస్తా నీకు అన్యధా..
మూడు తరాల కీర్తికి
ఇదే పరమావధా..
వినోదం రూపంలో హింసకు
ఇదే అవధా..
ఇప్పటికైనా చెప్పేస్తే అల్విదా
నీకు దన్నాలు శతధా..
సహస్రధా..,!

సురేష్ కుమార్.ఇ

LEAVE A RESPONSE