అడవిరాముడు..
యమగోల..
వేటగాడు..
డ్రైవర్ రాముడు..
కొండవీటిసింహం..
జస్టిస్ చౌదరి
సర్దార్ పాపారాయుడు..
బొబ్బిలి పులి..ఓ పరంపర..
హిట్టు మీద హిట్టు..
పస తగ్గిందనుకున్న ఎన్టీవోడు
దశ తిరిగి ఆయ్యాడు
ముఖ్యమంత్రి రామారావు..!
ఎన్ని పాత్రలు వేస్తే
అందరు ఎన్టీఆర్లు..
నిజాయితీ ఇచ్చిన అహం
కొండవీటిసింహం..
అద్భుతమైన ఆహార్యం..
ఆకట్టుకునే గాంభీర్యం.. నందమూరికి మాత్రమే
చెల్లిన నటశౌర్యం!
తప్పు చేసిన కొడుకును
పుట్టినరోజునే
అరెస్టు చేసిన నిబద్ధత..
బెల్టుతో దండించిన క్రమశిక్షణ..
ముందు..పిదప ఎంతమంది పోషించినా పోలీసు పాత్ర
అందరి కన్న మిన్నగా
రంజింపజేసింది
రంజిత్ కుమారే..
ఎన్టీఆర్ హిప్ హిప్ హుర్రే!
అప్పటికి అరవైకి చేరుతున్నా
తగ్గని వేడి..పోలీసోడి బాడి..
విలన్లతో కబాడి..
పాటల్లో.. స్టెప్పుల్లో
అదే వాడి..
బంగినపల్లి మామిడిపండు
అంటూ శ్రీదేవితో గంతు..
మా ఇంటి మహాలక్ష్మి
జయంతితో
ఆర్థ్రమైన గొంతు
అత్తమడుగు వాగులో
అదే నందమూరి..
ఈ మధుమాసంలో
అదే తారక రామారావు..
రాము..రంజిత్..
ఇద్దరూ ఇద్దరే..
ఎన్టీఆర్ బాపురే..!
కొండవీటిసింహం
విడుదలై నలభైఒక్క ఏళ్ళు..
07.10.1981..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286