• గిరిజనులకు జగన్ రెడ్డి చేస్తున్న అన్యాయం, ఎస్టీలపై వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ రాష్ట్ర ఎస్టీ కమిషన్ కు కనిపించడంలేదా? గిరిజనభూముల దోపిడీకే జగన్ రెడ్డి 3 రాజధానులంటున్నాడు.
• విశాఖ, ఉత్తరాంధ్రలోని గిరజనభూముల్ని కొల్లగొట్టడానికే జగన్ రెడ్డి 3 రాజధానులంటున్నాడు.
• గతంలో తండ్రి బయ్యారంలోని గిరిజనభూములు కాజేస్తే, ఇప్పుడు కొడుకు విశాఖలోని గిరిపుత్రులకు ఎసరుపెట్టాడు.
• రాష్ట్ర ఎస్టీ కమిషన్ గిరిజనుల పక్షాన నిలవకుండా, ప్రభుత్వానికి, జగన్ రెడ్డికి భజన చేస్తే, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది.
• గిరిజన శాఖ మంత్రి తన నియోజకవర్గానికి మంత్రా…లేక రాష్ట్రం మొత్తానికా?
• ధారునాయక్ , మొగిలి కల్లయ్య
ఉత్తరాంధ్ర మరీముఖ్యంగా విశాఖలోని గిరిజనుల్ని రోడ్లపాలుచేసి, వారిభూములు, విలువైన ఖనిజసంపదను కొల్లగొట్టడానికే జగన్ రెడ్డి మూడురాజధానులంటున్నాడని, ఆకోవలోనే పాడేరులోని భూములస్వాహాకు విజయసాయి సిద్ధమయ్యాడని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.ధారునాయక్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
“మూడున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఆసాంతం గిరిజనులకు తీరని శోకమే. గిరిజనులకోసం జగన్ రెడ్డి ఏర్పాటుచేసిన ఎస్టీ కమిషన్ వైసీపీ భజన విభాగంగా మారింది. రాష్ట్ర ఎస్టీ కమిషన్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, గిరిపుత్రులకు అండగా నిలవాల్సిందిపోయి, ప్రభుత్వానికి సన్నాయినొక్కులు నొక్కుతోంది. గతప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను ఎస్టీ కమిషన్ విమర్శించడం రాజకీయం కాదా? ఎస్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యులు తమతీరు మార్చుకోకుంటే గ్రామాల్లో తిరగలేరు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగావకాశాలు కల్పించే జీవోనెం-3ని సుప్రీంకోర్టు కొట్టేస్తే, అన్నిరాష్ట్రాలు అప్పీల్ కు వెళితే, జగన్ ప్రభుత్వం ఎందుకు తిరిగి అప్పీల్ చేయలేదని ఏనాడైనా రాష్ట్ర ఎస్టీ కమిషన్ ప్రశ్నించిందా? గతంలో జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా బయ్యారంలోని గిరిజన భూముల్ని కాజేశాడు. పాడేరుప్రాంతంలోని గిరిజన భూముల్ని దోచుకోవడానికే విజయసాయిరెడ్డి ఇప్పటికే తన మనుషుల్ని అక్కడఉంచాడు. జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి భూదోపిడీకి అంతిమంగా బలవుతోంది ఉత్తరాంధ్ర గిరిజనులే.
పల్నాడుజిల్లా, నకరికల్లు మండలంలో గిరిజనమహిళను శ్రీనివాసరెడ్డి అనేవ్యక్తి ట్రాక్టర్ తో గుద్దిచంపితే అతనిపై ఏంచర్యలు తీసుకున్నారు. సదరు మహిళ కుటుంబానికి ఎస్టీ కమిషన్ ఏం న్యాయంచేసింది? పల్నాడుజిల్లా మాచర్లమండలం అనుపులో గిరిజన మహిళపై అత్యాచారం జరిగితే ఎస్టీ కమిషన్ ఏంచేసింది? గిరిజనులపై జరుగుతున్న దారుణాలు రాష్ట్ర ఎస్టీకమిషన్ కు కనిపించడంలేదా? టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు అమలైన పథకాలన్నింటినీ జగన్ రెడ్డి తొలగించినా కమిషన్ సభ్యులు నోరుమెదపలేని దుస్థితిలో ఉన్నారు. గిరిజనశాఖ మంత్రి తన నియోజకవర్గానికే మంత్రా…లేక రాష్ట్రానికి మంత్రా అన్న సందేహం కలుగుతోంది. టీడీపీప్రభుత్వం 500కు పైబడి జనాభాఉన్న గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించి నిధులు కేటాయిస్తే, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ నిధులన్నీ ఆపేశాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క గిరిజన తండాకైనా చిన్నరోడ్డు వేసిందా? బ్యాక్ లాగ్ పోస్టులభర్తీ, తండాలకు తాగునీరు, వైద్యసౌకర్యం వంటివాటిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కేంద్రంనుంచి గిరిజనులకు అందే ప్రయోజనాలను కూడా జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆర్ వో ఎఫ్ఆర్ (అటవీభూములపై గిజనులకు హక్కులు కల్పించడం) పథకాన్ని జగన్ రెడ్డి పూర్తిగా అటకెక్కించాడు.
గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక ఉత్తీర్ణతాశాతం పడిపోయింది. 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పిన జగన్ రెడ్డి, ఇప్పుడు పట్టణాల్లోని వారికి అది వర్తించదంటున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో 700మంది సలహాదారులుంటే వారిలో ఒక్క గిరిజనుడు కూడా లేడు. వైసీపీప్రభుత్వంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం మాటల్లో వర్ణించలేనిది. విశాఖ, ఉత్తరాంధ్రలోని గిరిజనభూముల్ని, విలువైన ఖనిజసంపదను దోచుకోవడానికే జగన్ రెడ్డి మూడురాజధానులంటున్నాడు. మూడురాజధానుల వ్యవహారంతో రాష్ట్రం పరువు పోయింది. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేని వ్యక్తికి 3 రాజధానులున్నా, 30 రాజధానులున్నా ఉపయోగంలేదు. గతంలో గిరిజనులు ప్రమాదవశాత్తూ మరణిస్తే, వారికి రూ.5లక్షలు అందేవి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే ఆ పథకాన్నే రద్దుచేశాడు. చంద్రబాబుహయాంలో గిరిజనులకు జరిగిన మేలుతో పోలిస్తే, జగన్ రెడ్డి వచ్చాక జరిగింది శూన్యం. వైసీపీప్రభుత్వం తమకు చేస్తున్న అన్యాయాన్ని గిరిజనులు గ్రహించి పోరాటానికి సిద్ధంకావాల్సిన సమయం ఆసన్నమైంది.
జగన్ రెడ్డి జీవోనెం-3పై తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలి : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య
గిరిజనులకు తీరని అన్యాయంచేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని వదిలేది లేదు. జగన్ రెడ్డికి భజనచేస్తున్న గిరిజననేతలంతా వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. బడుగు, బలహీనవర్గాలవారంతా సమానంగా, సంతోషంగా ఉండాలన్న సదుద్దేశంతో అంబేద్కర్ మహానీయుడు రాజ్యాంగాన్ని రూపొందించారు. వైసీపీప్రభుత్వం అలాంటి రాజ్యాంగానికి తూట్లుపొడుస్తూ, గిరిజనులను దారుణంగా అణచివేస్తోంది. గిరిజనరిజర్వేషన్లు తగ్గించిన జగన్ రెడ్డి, ఉపాధిరంగాలను ప్రైవేట్ పరంచేయడానికి సిద్ధమయ్యాడు. వైసీపీప్రభుత్వం తక్షణమే గిరిజన రిజర్వేషన్లు పెంచాలి. గిరిజన నేతల హౌస్ అరెస్ట్ లను తక్షణమే నిలిపేయాలని టీడీపీ గిరిజన విభాగం తరుపున డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి అడవిబిడ్డలపై ఏమాత్రం చిత్తశుద్ధిఉన్నా, తక్షణమే జీవోనెం-3పై శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రప్రభుత్వానికి పంపాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. అన్ని ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను ముఖ్యమంత్రి వెంటనే భర్తీచేయాలి.