ఇదీ నేడు మన రాష్ట్రం అంటూ పలు ఘటనలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్
• కాకినాడ జిల్లా జె తిమ్మాపురంలో అసుపత్రికి వెళుతున్న పసిబిడ్డ గుంతల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రస్తావిస్తూ ట్వీట్.
• ప్రభుత్వ కాంట్రాక్ట్ బిల్లులు మంజూరు కాక…క్యాన్సర్ బాధితుడైన తండ్రి వైద్యానికి డబ్బులు లేక వేదన పడుతున్న లేపాక్షి మండలం వెంకటశివప్ప ఘటనను ప్రస్తావించిన చంద్రబాబు.
• రాష్ట్ర ఆదాయం గాడిన పడింది అన్న సిఎం సమీక్ష వార్తను, వారం రోజులు అయినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పడని అంశాన్ని కలిపి ట్వీట్ చేసిన చంద్రబాబు.
• రాష్ట్రంలో పాలనా దుస్థితికి ఈ ఘటనలే ఉదాహరణలు:- టిడిపి అధినేత చంద్రబాబు
• ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎలా చిధ్రం చేస్తున్నాయో చెప్పడానికి ఇవి నిదర్శనం.
• ప్రజలను బాదేస్తున్న పన్నులు ఎటుపోతున్నాయి….లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయి? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే!