– టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్
మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ది ప్రకటనలకే పరిమితం అవుతుంది. కాకినాడలో దేవిక హత్య విషయంలో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ స్వయంగా సిఎం ప్రకటనలు చెయ్యడం మోసగించడమే.
సీఎం, ప్రభుత్వం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలు మాని…. నిందితులకు వెంటనే శిక్షపడేలా చూడాలి. అప్పుడే నేరస్థులకు భయం… మహిళలకు నమ్మకం కలుగుతుంది. కొత్త చట్టాలు కాదు…కనీసం ఉన్నచట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు.
గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసుపెట్టిన వివాహిత ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. మహిళల పై నేరాల విషయంలో ప్రభుత్వం ఎంత అలసత్వంతో ఉందో అర్థం అవుతుంది.