Suryaa.co.in

Political News

టీడీపీకి బాలయ్య కొండంత బలం

బాలయ్య టీడీపీకి ఎందుకు బలమో చిన్న ఉదాహరణ చెప్తా…
పోయినేడాది పార్టీ పరిస్థితి నిజంగా దారుణం… చంద్రబాబు విధానాలు ఒక్కోసారి బాగున్నా…
నారా లోకేష్ పర్యటనలు ఒక్కోసారి ఊపుతెస్తున్నా… అందరిలో ఉత్సాహం అనేది రాలేదు…
విధానాలపై పర్యటనలపై అవగాహన ఉన్నాళ్ళకు మాత్రమే అవి నచ్చాయి…
ఎప్పుడైతే అల్లూ అరవింద్ ఆహాలో ఇగో లేకుండా బాలయ్య ఒప్పుకున్నాడో…
ఎప్పుడైతే అఖండ సినిమా విడుదల అయిందో…
నా సినిమా టికెట్ రేట్ల కోసం నేను జగన్ను కలవనూ అని బాలయ్య చెప్పాడో…
టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు పూనకం వచ్చేసింది.
తొక్కి పెట్టిన వాళ్ళందరూ సోషల్ మీడియాలో… బయట కదం తొక్కారు… బాలయ్య కెరీర్‌లోనే భారీ వసూళ్ళు తెచ్చిన సినిమా…
అఖండ తర్వాత మనలో ఎంత హుషారు ఉందో అందరికి తెలుసూ…
ఇక … న్యూట్రల్, మెగా ఫ్యాన్స్‌లో హీరో అయిపోయాడు…
ఇప్పుడు సీజన్ 2కి బాబు గారిని పిలిచి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చేసాడు…
దసరా తర్వాత నుంచి ప్రతీ ఒక్కడూ ఎదురు చూస్తున్నాడు బాలయ్య – బాబు గారి ఎపిసోడ్ కోసం…
న్యూట్రల్‌, ప్రత్యర్ధులకు, బాలయ్యను వెటకారంగా మాట్లాడే వాళ్ళకు, టీడీపీలో ఉండి నాటకాలు ఆడే వాళ్ళకు ఈ ఎపిసోడ్ ఎన్నో ఆన్సర్‌లు ఇవ్వనుంది…
మళ్ళీ చెప్తున్నా టీడీపీకి బాలయ్య కొండంత బలం…!

– రామ్మోహన్

LEAVE A RESPONSE