Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు కోసం కులాన్ని వాడుకుంటావా పవన్ కల్యాణ్..?

– నీ భాష, చేష్టలతో కాపుల పరువు తీస్తున్నావ్..
– కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు
– చంద్రబాబు-పవన్ డైరెక్షన్ లో కాపులపై కుట్ర
– కాపులను తొక్కుకుంటూ పైకి ఎదగాలంటే కాపులు క్షమించరు.
– వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నేతలు కాపులు కాదా..?
– రంగాను హత్య చేయించిన బాబు దగ్గర చేతులు కట్టుకుని కాపుల పరువు తీస్తావా?
– చంద్రబాబును సీఎం చేయాలని చూసే పవన్ కుట్రలను జనసైనికులు గుర్తెరగాలి
– విశాఖలో మంత్రులపై దాడుల వెనుక చంద్రబాబు-టీడీపీ
– అడపా శేషు

బాబు ముందు చేతులు కట్టుకోవడమా?
వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నా కొడకల్లారా.. అంటూ పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాపు కార్పొరేషన్ ఛైర్మన్, వైఎస్ఆర్సీపీ నేత అడపా శేషు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు కులానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను చులకనగా, హేళనగా మాట్లాడటానికి పవన్ కు సిగ్గు ఎక్కడ లేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు కాపులు కాదా..? అని నిలదీశారు. మా పార్టీ కోసం 12-13 ఏళ్ళుగా కష్టపడి పనిచేసి, వివిధ పదవుల్లో ఉన్న కాపు కులస్తుల్ని, నీవు కూడా కాపు కులంలోనే పుట్టి, కాపులను అవమానిస్తే.. మిగతా కులాల వారు ఏ విధంగా చూస్తారన్న కనీస ఆలోచన, స్పృహ లేదా అని ప్రశ్నించారు. కాపుల్ని తొక్కుకుంటూ.. తాను మాత్రమే పైకి ఎదగాలని పవన్ కల్యాణ్ కోరుకోవడం తప్పు, కాపులు క్షమించరు అని అన్నారు.

వంగవీటి రంగా హత్యకు కారణమైన చంద్రబాబును విజయవాడలోని హోటల్ లో కలిసి, ఆయన పక్కన చేతులు కట్టుకుని నిలబడి పవన్ కల్యాణ్ కాపుల పరువును తీశాడని తాడేపల్లిల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అడపా శేషు ధ్వజమెత్తారు. గతంలో కూడా జనవాణి కార్యక్రమానికి విజయవాడ వచ్చి, కనీసం రంగా విగ్రహానికి దండ వేయని పవన్ కల్యాణ్ కు కాపుల పట్ల ఏం ప్రేమ ఉందని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి కావాలని జనసైనికులు ఆయన చుట్టూ వీరావేశంతో తిరుగుతుంటే.. అతను మాత్రం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనే విధంగా వ్యవహరించడాన్ని కాపు యువత గుర్తించాలన్నారు.

బాబు కోసం కులాన్ని వాడుకుంటావా..?
2014లో జనసేన పార్టీ పెట్టి, పైకి మాత్రం కాపుల పార్టీ అనే నినాదం తీసుకెళ్ళి, చంద్రబాబు కోసం, ఆయన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం పవన్ కల్యాణ్ కులాన్ని వాడుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా రంగాను చంపించిన హంతకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడటానికి సిగ్గు లేదా పవన్ కల్యాణ్..? అని అడపా శేషు నిలదీశారు. రాజమండ్రి వెళ్ళి, మీరంతా ఓట్లు వేస్తే జనసేన గెలిచేదే అంటూ కాపులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా శేషు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014లో మీ వల్ల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అనేక దుర్మార్గాలు చేస్తుంటే, జన్మభూమి కమిటీలతో వేధిస్తే మీరు ఏం చేశారు?అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ కు ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తానన్న చంద్రబాబు… ఆఖరికి 2014-17 చివరి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. అలానే, కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం కాపు గర్జనకు పిలుపునిస్తే.. అప్పడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ గారు మద్దతు ఇచ్చారు. ఆ ఉద్యమంలోకి కొంతమంది కుట్రదారులు జొరబడి తుని వద్ద రైలు తగలబెడితే.. అప్పటి టీడీపీ ప్రభుత్వం కాపు నేతలు, యువకుల మీద కేసులు పెట్టింది. ఆ ఘటనలో ఉన్న అదృష్ట శక్తులెవరో పవన్ కు తెలియదా..? అని ప్రశ్నించారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి.. లంజా కొడకా.. అని తిడితే, వారి కుటుంబ సభ్యులను ఆడవాళ్ళను జుట్టు పట్టుకుని కొడితే.. ఆరోజు నీకు కాపులు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. కోనసీమకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని నామకరణం చేస్తే.. అక్కడ కూడా అల్లర్లు చేయించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసింది ఎవరో మీకు తెలియదా అని ప్రశ్నించారు.

కాపులపై కుట్ర
చంద్రబాబు- పవన్ కల్యాణ్ డైరెక్షన్ లో కాపుల మీద పెద్ద కుట్ర జరుగుతుందని, జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణను, మూడు రాజధానుల విధానాన్ని మరుగునపడేయటం కోసం.. టీడీపీ పేమెంట్ ఆర్టిస్టులంతా విశాఖలో తిష్ట వేసి, మంత్రులపై దాడులకు, తద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేశారన్నారు. పవన్ కల్యాణ్, విశాఖ ఎయిర్ పోర్టులో దిగే సమయానికి కూడా అక్కడకు అంతమంది యువత వస్తున్నారని పవన్ కల్యాణ్ కే తెలియదని, దాని వెనుక టీడీపీ, చంద్రబాబు ఉన్నారన్నారు. తీరా మా మంత్రులపై దాడులు చేస్తే.. ఖండించాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, విజయవాడలో హోటల్ గదికి వెళ్ళి పవన్ ను పరామర్శించం ఏమిటని అడపా ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా, విశాఖలో జరిగిన ఘటనకు సంబంధించి, దాని వెనుక ఉన్న కుట్రను చేధించేందుకు ఓ కమిటీ వేయండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.

మూడు పెళ్ళిళ్ళు నినాదం ఇస్తే.. యువత పరిస్థితేంటి..?
పవన్ కల్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించటం లేదు. కేవలం సినిమా యాక్టర్ గా, సినిమాల్లో స్క్రిప్టు చదివి వెళ్ళిపోయినట్టు, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదివి వెళ్ళిపోతే.. అంతిమంగా కాపు కులమే అవహేళనకు గురి అవుతుందన్నారు. ఏ నాయకుడైనా యువతకు మంచిని మార్గనిర్దేశం చేస్తారని, అలాకాకుండా, నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను, మీరు కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకోండి.. అని పవన్ కల్యాణ్ చెబుతుంటే, యువత అదే నినాదంగా తీసుకుంటే పరిస్థితి ఎటు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కులం ఏమైపోయినా ఫర్వాలేదు.. నేనే కులం అని భావిచడం చాలా తప్పు అని అన్నారు. చిరంజీవి తమ్ముడిగా పుట్టడం వల్లే నీకు సినిమా అవకాశాలు వచ్చాయన్న సత్యాన్ని వదిలేసి, కహానీలు చెబితే వినేవారే లేరన్నారు. మీ తండ్రి నీకు జన్మనిస్తే.. సినిమాల్లో అవకాశాలు ఇప్పించి చిరంజీవి గారు నీకు పునర్జన్మ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాపుల భవిష్యత్తు కోసం.. కాపు అక్కచెల్లెమ్మల భవిష్యత్తు కోసం.. సంక్షేమ పథకాల ద్వారా జగన్ మోహన్ రెడ్డిగారు ఎంతగానో కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ గారు.. కులం.. మతం.. పార్టీలు.. ఇఏవీ చూడకుండా అన్ని కులాలకు సామాజిక న్యాయపరంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు.

LEAVE A RESPONSE