– సీబీఐ అఫిడవిట్ తో వివేకా హంతకులు భారతీరెడ్డి కుటుంబీకులేనని స్పష్టం
– హంతకులకు కొమ్ముకాసే విషయంలో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపే
– తేలుకుట్టిన దొంగల్లా జగన్, తాడేపల్లి ప్యాలెస్ కుక్కలు మౌనం
-బొండా ఉమామహేశ్వరరావు
వివేకా హత్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. హత్యతో తనకు సంబంధం లేదంటే జగన్ రెడ్డి ఇప్పటికైనా వివేకా హంతకులను అరెస్టు చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేకా హత్య కేసు వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్.సునీతా రెడ్డి సుప్రీం కోర్టు తలుపులు తట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్ రెడ్డికి సిగ్గుచేటుగా భావించాలి. కడప ఎంపీ టికెట్ వైఎస్ కుటుంబంలోనే ఉండాలని వివేకా పట్టుబట్టినందుకు భారతీరెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, తదితరులు పక్కా ప్రణాళికతో గొడ్డలితో దారుణంగా నరికి చంపారని సీబీఐ అఫిడవిట్ తో స్పష్టంగా తెలుస్తోందన్నారు.
తేలుకుట్టిన దొంగల్లా జగన్, పెంపుడు కుక్కలు:
వివేకా హత్య ఉందంతం జగన్ రెడ్డికి తెలుసని, అందుకే హత్య గురించి జగన్ రెడ్డి నోరు మెదపడంలేదని తెలిపారు.ప్రతిపక్షం చిన్న విమర్శ చేస్తే మొరిగే తాడేపల్లి పెంపుడు కుక్కలు వివేకా హత్య గురించి ప్రతిపక్షం బాహాటంగా విమర్శలు చేస్తుంటే ఎందుకు మొరగకుండా తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారో స్పష్టంగా అర్థమవుతోంది. వివేకా హత్య కేసును సీబీఐ విచారించాలని హైకోర్టును ప్రతిపక్షంలో ఉండగా కోరిన జగన్….అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఉపసంహరించుకున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, కొంత మంది అదృశ్య శక్తులు కేసును ప్రభావితం చేస్తున్నారని సీబీఐ అఫిడవిట్ లో పేర్కొంది. ఇదే అవినాష్ రెడ్డిని జగన్ అసెంబ్లీ సాక్షిగా వెనకేసుకొచ్చి వంతపాడడం దేనికి నిదర్శనమో జగన్ సమాధానం చెప్పాలని కోరారు. హంతకులకు జగన్ కొమ్ముకాస్తున్నారనడానికి ఇంతకన్నా వేరే రుజువు అవసరంలేదని అభిప్రాపడ్డారు.
జగన్ కనుసన్నల్లోనే వివేకా హత్య:
వివేకా హత్య జరిగిన రోజు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడిన మాటలు పొంతనలేకుండా ఉన్నాయి. దీన్ని బట్టి హత్య విషయం జగన్ కు ముందే తెలుసని రుజువవుతుంది. నిజంగా వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేకుపోతే 43నెలలు ఈ కేసు ఎటూ తేలకుండా ఎందుకు ఉందో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ సొంతచెల్లి షర్మిల ఢిల్లీలో వివేకా హత్య కడప ఎంపీ సీటు నేపథ్యంలోనే జరిగిందని బాహాటంగా మీడియా ముందు చెప్పింది. దీనిపై ఇప్పటి వరకు జగన్ నోరెందుకు విప్పలేదు…ఈ మౌనం వెనుక ఆంతర్యమేంటో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సామాన్యులకు ఏం న్యాయం చేస్తావు జగన్?
సొంత బాబాయ్ హత్య కేసును తేల్చలేక కేసును వేరే రాష్ట్రానికి బదిలీ అయ్యేలా వ్యవహరించిన చేతకాని ముఖ్యమంత్రి….సామాన్యులకు ఏం న్యాయం చేస్తాడు? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు విషయంలో జగన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం పరువును మంటగలిపారు. ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను ఫార్వార్డ్ చేస్తే అర్థరాత్రి గోడలు దూకి అరెస్టు చేసే సీఐడీ…వివేకా హత్య కేసు విషయంలో ఎందుకు మౌనం పాటించిందో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుత డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి వివేకా హత్య కేసువైపు కనీసం తొంగిచూడలేదంటే…హత్య వెనుక ఏ హస్తం ఉందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
సాక్ష్యులను చంపాలని చూస్తున్నది ఎవరు జగన్?
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని చంపడానికి చూస్తున్నది ఎవరో సీఎం నోరువిప్పాలని కోరారు. నాకు ప్రాణహాని ఉందని మొత్తుకుంటున్న దస్తగిరి భద్రత ప్రశ్నార్థకంగా మారిందని సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్ష్యులకు భద్రత కల్పించడం, హంతకులతో కలిసి సీబీఐ విచారణాధికారులను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం, బాంబులేసి చంపేస్తామని బెదిరించడం వెనుక ఎవరి హస్తముందే జగన్ సమాధానం చెప్పాలని కోరారు. వివేకా హత్యకు రూ.50కోట్లు సుపారీ, అడ్వాన్స్ రూ.5కోట్లు హంతకులకు ఇచ్చింది
భారతీరెడ్డి కుటుంబం కాదా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. వివేకా హత్యకు సంబంధించిన ప్రతి విషయం జగన్ రెడ్డికి సంబంధం ఉందని తేల్చిచెప్పారు.
హంతకులను తక్షణమే సీబీఐ కటకటాల్లోకి పంపాలి:
సీబీఐ తక్షణమే ఈ కేసును విచారణ చేసి హత్యకు సహకరించిన వారిని, హంతకులకు అండగా నిలబడిన వారిని, సాక్ష్యులను చంపాలని చూసిన వారిని, హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతిఒక్కరినీ కటకటాల వెనక్కి పంపాలని టీడీపీ కోరుకుంటోందన్నారు. జగన్ ను సీబీఐ అరెస్టు చేయడానికి ముందే హత్యకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.