-కాపు సామాజికవర్గంలోని వైసీపీ నాయకులు కాపులను తిడితే అడ్రస్ గల్లంతవుతుంది
– ఏ కార్పొరేషన్ కూడా వైసీపీని నమ్మే పరిస్థితులు లేవు
– రంగా హత్య గురించి మాట్లాడేవారు ప్రధాన కారకులైన కుటుంబంలోని దేవినేని అవినాష్ ను మీ పార్టీలో చేర్చుకోలేదా?
*మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్
కాపు సామాజికవర్గం వైసీపీకి దూరమవుతోందనే భయం వైసీపీ నాయకులకు పట్టుకుంది. కాపు సామాజికవర్గం దూరమైతే వచ్చే ఎన్నికల్లో వైపీపీ పరిస్థితి ఏంటనే డైలమాలో వైసీపీ పడింది. భయంతో, కంగారుతో మదనపడుతూ రాజమండ్రిలో వైసీపీ కాపు మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు. ఈ సమావేశంలో కాపు సామాజికవర్గానికి జగన్మోహన్ రెడ్డి చాలా చేశారని మాట్లాడారు. చేసిన పనులకు, సమావేశంలో చెప్పినదానికి చాలా తేడా ఉంది. కాపు సామాజికవర్గం నుంచి పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించారు. ఈ విషయం జీర్ణించుకోలేక జనసేన పార్టీపై దాడి చేయడమే ప్రధానంగా పెట్టుకున్నారు.
ఇంతపెద్దఎత్తున దాడులు చేస్తున్నాం, కాపు సామాజికవర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయి, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ పరిస్థితి ఏంటని వైసీపీ నాయకుల్లో గబులు మొదలైంది. ఈ ఉద్దేశంతోనే కాకినాడలో సభ పెట్టుకున్నారు. కాపుల్లో పేదలు చాలా మంది ఉన్నారు. వీరిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు మంజూరు చేస్తూ వచ్చారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికి 3 వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. ఎంతోమంది చదువుకున్న విద్యార్థులకు కాపు కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. విదేశీ విద్య పథకం ద్వారా 12 వందల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లడానికి అవకాశం కల్పించారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకం ద్వారా 10 శాతం మందికైనా చదువుకోవడానికి విదేశాలకు పంపారా?ఇందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు సమాధానం చెప్పాలి. పట్టుమని పదిమందిని కూడా విదేశాలకు పంపలేదు.
కాపు కార్పొరేషన్ ద్వారా ఉన్నత విద్యకు ఎవరికీ అవకాశం కల్పించలేదు. టీడీపీ కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఉద్యోగాలు చేయడానికి కల్పించారు. 47 మందికి అవకాశం కల్పించి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చదువుకొని ఫౌండరీ, షాపు పెట్టుకోవాలంటే వారికి ఆర్థిక సహాయ అవకాశాలను కాపుకార్పొరేషన్ కల్పించింది. ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎంతమందికి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చారో తెలపాలి. ఎంతమందికి కొత్తగా ఇండస్ట్రీస్, ఫౌండేషన్స్ పెట్టుకోవడానికి అవకాశాలు కల్పించారో తెలపాలి. పెన్షన్లు, రైతు సబ్సీడీ, కాపునేస్తం ద్వారా కాపులకు నిధులు ఖర్చు చేశామనడం దుర్మార్గం. కార్పొరేషన్లు పెట్టేది చదువుకొని వృద్ధిలోకి రావడానికి, వాళ్ల కాళ్లమీద వారు నిలబడడానికి. వీటికి ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎంత కేటాయించారో తెలపాలి. కాపు సామాజిక వర్గం తమను బీసీల్లో చేర్చాలని అనేక ఉద్యమాలు చేసింది. కమిటీలు వేశారు. వీరికి న్యాయం జరగలేదని బీసీలకు ఇబ్బంది లేకుండా చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ సామాజికవర్గాన్ని కూడా బీసీల్లో చేర్చాలనే తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓబీసీలో 10 శాతం లో 5 శాతాన్ని కాపులకు జీవో ఇచ్చారు. దీన్ని అమలుచేయలేదు. కాపులకు చంద్రబాబునాయుడు తెచ్చిన 5 శాతం రిజర్వేషన్ ను రద్దు చేయలేదా?ఈ రిజర్వేషన్ ఏమైంది? మీరు ఎందుకు దీన్ని అమలు చేయలేదో చెప్పాలి. బహుశ రద్దు చేశారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలి. డొంక తిరుగుడు సమాధానాలు వద్దు. కాపు కార్పొరేషన్ కి ఏమీ చేయలేదు.
ఈ సామాజికవర్గ భ్రమలు తొలగిపోయాయి. పవన్ కల్యాణ్ ను రోజూ తిట్టడం, ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఈ సామాజికవర్గం మనోభావాలు దెబ్బతిన్నాయనే ఇంటలిజెన్స్ రిపోర్టు వైసీపీకి అందింది. దానికి కంగారు పడి మీటింగ్ పెట్టుకున్నారు తప్పితే నియోజకవర్గంపై ప్రేమతో కాదు. ఎప్పుడో జరిగిన వంగవీటి రంగా హత్య గురించి మాట్లాడుతున్నారు. లేదా? రంగా హత్య తప్పు కాదు అని చెప్పిన గౌతమ్ రెడ్డికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ పదవి ఇచ్చారు. చిరంజీవి పోటీ చేసిన తిరుపతిలో జగన్ సన్నిహితులు దాడి చేయలేదా? కోనసీమ, విశాఖ, చిత్తూరులలో కాపు సామాజికవర్గంపై అనేక కేసులు పెట్టారు. ఇద్దరు డీఎస్పీలను మీ సామాజికస్తులను నియమించుకొని అనేక కేసులు పెట్టారు. రాజంపేట సీటును స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి బలిజలకు ఇస్తుంటే.. ఈసారి రాజంపేట సీటు బలిజలకు ఇవ్వకుండా మిథున్ రెడ్డికి ఇచ్చారు. చెంగల్ రాయుడు మీద బాంబు దాడులు చేసింది వైసీపీ నాయకులు కాదా? భయంతో కాపులపై ప్రేమ ఒలకబోస్తున్నారన్న విషయం ప్రజలకు తెలుసు.
మీరు ఆలోచించి బురద జల్లడాన్ని మానాలి. మొట్టమొదట ఉప ముఖ్యమంత్రిని ఇచ్చింది చంద్రబాబునాయుడే. సంక్షేమం, అభివృద్ధి చేసింది టీడీపీనే. చెప్పుకోవడానికి వైసీపీకి మచ్చుకు ఒకటి కూడా లేదు. కేవలం పదవులు ఇస్తే సరిపోదు. ఏం చేశారో అది చెప్పాలి. రాబోవు రోజుల్లో కూడా కాపు సామాజికవర్గానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుంది. 24 శాతం ఉన్న ఈ సామాజికవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలనే థృక్పథం చంద్రబాబునాయుడుకు ఉంది. తప్పకుండా ఆ పంథాలో ప్రయత్నం చేస్తారు. మీ నాయకుడిని సంతృప్తి పరచడానికి మీ విలువల్ని పోగొట్టుకోవద్దు. కొంతమంది కాపు సామాజిక వర్గాన్ని నీచంగా మాట్లాడుతున్నారు. అది మానుకోవాలి. కాపు సామాజికవర్గంలో పుట్టి మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. ఆ సామాజికవర్గాన్ని తిట్టడం మానివేస్తే రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. లేకుంటే అడ్రస్ గల్లంతౌతుందని మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు.