కుప్పంలో ఒక్కో ఓటుకు 5 వేల రూపాయలిచ్చి గెలిచాం.! ఈ మాట అన్నది ఎవరో కాదు.. వైకాపా నేతే..! చెప్పింది ఎక్కడో కాదు ఏకంగా పురపాలక సర్వసభ్య సమావేశంలోనే! అన్నది ఎవరితోనే కాదు స్వయంగా మున్సిపల్ కమిషనర్‌తోనే.!
ఔను.. పనుల్లేవు, బిల్లులు లేవంటూ అధికార పార్టీ నేతలే కుప్పం పురపాలక సమావేశంలో కస్సుమన్నారు. విన్నారుగా కుప్పంలో ఒక్కో ఓటుకు 5 వేలు ఖర్చు పెట్టి గెలిచారట. ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తున్న ఈయన… కుప్పం మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దేవకి భర్త రంగయ్య.! పురపాలక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఎలా అనుమతిచ్చారన్నది కాసేపు పక్కనబెడితే భార్య తరఫున వచ్చిన రంగయ్య సమావేశంలో అసలు గుట్టువిప్పారు.
మున్సిపాలిటీలో తమకు ఎలాంటి పనులు కేటాయించడం లేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. ఇటీవలే 800 రూపాయలు బిల్లు పాస్ చేశామని కమిషనర్ బదులివ్వడంతో రంగయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత చిన్న పనులా కేటాయించేదంటూ కోపగించుకున్నారు.
ఇక పులివెందులతో సమానంగా కుప్పంను అభివృద్ధి చేస్తానని సీఎం జగన్ ఇటీవల వైకాపా నియోజకవర్గ సమీక్షలో నాయకులకు చెప్పారు. కానీ అక్కడ పనులు జరగడంలేదని పురపాలిక సర్వసభ్య సమావేశంతో తేలిపోయింది. అభివృద్ది పనుల కోసం గతంలో నిర్వహించిన టెండర్ల పనులు… ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని, అలాంటప్పుడు సమావేశాలు ఎందుకంటూ ఏకంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మునుస్వామి సమావేశాన్ని బహిష్కరించారు.