Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయ్

• 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని అయ్యన్న పాత్రుణ్ణి అరెస్ట్ చేసిన తీరు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీకి నిదర్శనం
• విశాఖ భూ కబ్జాలు, బాబాయ్ హత్య కేసులో సీబీఐకి షర్మిల వాంగ్మూలం నుంచి దృష్టి మరల్చేందుకు అక్రమ అరెస్ట్
• వైసీపీలో సిగ్గులేని బీసీ మంత్రులు ఈ ఘటనపై నోరు విప్పరేం?
బోండా ఉమామహేశ్వర రావు

40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని రాజకీయ నాయకుడిగా నిలిచిన అయ్యన్నపాత్రుణ్ణి అరెస్ట్ చేసిన తీరు రాష్త్రంలో ప్రజాస్వ్యామం ఖూనీకి నిదర్శనం. జగన్ రెడ్డి రాక్షస పాలనపై ఎవరు గళమెత్తినా పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతోందా ? బడుగు, బలహీన వర్గాలను భయపెట్టి జగన్ రెడ్డి పాలన చేస్తున్నాడు. వైస్ వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐ ఎదుట జగన్ రెడ్డి చెల్లెలు షర్మిల కుండబద్దలు కొట్టింది. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పోలీసులే దొంగల్లా గోడలు దూకి అరెస్ట్ చేశారంటే రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టే అది సాధ్యమైంది. మూడున్నరేళ్ల జగన్ రెడ్డి అవినీతి చిట్టాను టీడీపీ నేతలంతా బయటపెట్టాం. విశాఖ రాజధాని పేరుతో రూ. 42 వేల కోట్లను విజయసాయి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ సహా ఉత్తరాంధ్ర వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దోచుకుతింటున్నారు. విజయసాయి కొల్లగొట్టిన దసపల్లా, బే పార్క్ సహా కొండలు, గుట్టలను కొల్లగొట్టిన తీరుపై అయ్యన్నపాత్రుడు గారు అలుపెరుగని పోరాటం చేస్తున్నందుకు కక్షకట్టి అక్రమ కేసులు పెట్టారు.

అర్ధరాత్రి సీఐడీ వాళ్లు దండుపాళ్యం బ్యాచ్ లా గోడులు దూకి మరీ ఆయన ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారు. ఇంట్లోని మహిళలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పటికే అయ్యన్నగారిపై 15 కేసులు పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో 70 ఏళ్ల అయ్యన్నపాత్రుడిపై పోక్సో కేసు పెట్టారు. అడుగు స్థలంలో ప్రహరీ కట్టారని గోడ కూల్చారు. నానా రాద్ధాంతం చేశారు. గోడకు- సీఐడీకి సంబంధమేంటో సునీల్ కుమార్ సమాధానం చెప్పాలి. సునీల్ అరాచకాలపై సెంట్రల్ విజిలెన్స్ కు మేమిచ్చిన ఫిర్యాదుపై ఎంక్వైరీ జరుగుతోంది. తాజాగా కేంద్రం నుంచి సునీల్ కుమార్ అరాచకాలపై విచారణ జరపమని ఏపీ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చాయి. ప్రజల హక్కలను కాలరాస్తూ ఇష్టారాజ్యంగా పోలీసులు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. మీరు కొట్టేసిన రూ. 42 వేల కోట్లు ఆస్తుల చిట్టాను సర్వే నంబర్ల సహా బయటపెట్టి పోరాటం చేయడమేనా అయ్యన్న చేసిన తప్పు? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజా సేవలో ఉన్న వ్యక్తిని వేధిస్తారా? సిగ్గులేని వైసీపీ బీసీ మంత్రులారా మీరు కూడా ఆలోచన చేయండి.

బీసీలను వేధించి అరెస్టులు చేయడమేనా బీసీ పక్షపాతి అంటే? జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం. ఏపీ సీఐడీ చీఫ్ అధికార ఉల్లంఘనపై న్యాయ పోరాటం చేసినట్టే అధికారులపైనా చేస్తాం. వైసీపీలోని బీసీలు, మేధావులంతా అయ్యన్న అరెస్ట్ ను ఖండించాలి. జగన్ రెడ్డి అవినీతిని ధైర్యంగా బయటపెట్టినందుకు పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకే అరెస్ట్ చేశారు. బీసీల కోసం, ఉత్తరాంధ్ర హక్కుల కోసం పోరాడిన అయ్యన్నపాత్రుణ్ణి చాలా అవమానకరంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ పై న్యాయ పోరాటం చేస్తాం. అయ్యన్న , ఆయన కుమారుడిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. అర్ధరాత్రి 2, 3 గంటల సమయంలో FIR రాసే స్థితికి పోలీసులు వచ్చారంటే సిగ్గుచేటు. వివేకానంద రెడ్డి హత్య కేసులో హంతకులను పట్టుకోలేని సన్నాసి ప్రభుత్వం జగన్ రెడ్డిది.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వాట్సాప్ లో పోస్టులు ఫార్వాడ్ చేశారని దారపనేని నరేంద్ర సహా ఎంతోమందిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసింది. 149 కేసుల్లో ఒక్క కేసు అయినా కోర్టులో నిలబడిందా? రాష్ట్ర డీజీపీని హైకోర్టుకు పిలిచమరీ అక్షింతలు వేసినా జగన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గురావడంలేదు. సీఐడీ అధికారులు వైసీపీ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారు. ప్రమోషన్ల కోసం, పైసల కోసం కక్కుర్తి పడి ఎంతోమంది పనిచేస్తున్నారు. మరో ఏడెనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం ఓటమి ఖాయం. అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని టీడీపీ ఏర్పాటు చేయడం ఖాయం. అధికారంలోకి రాగానే బాధ్యత మరిచి,నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించిన అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకుంటాం.

LEAVE A RESPONSE