అయ్యన్నపాత్రుడు, రాజేష్ అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాం

Spread the love

– ప్రహరి గోడకు, సీఐడీకి ఏం సంబంధం?
-ముఖ్యమంత్రి ఆనందం కోసం సీఐడీ పనిచేస్తోంది
-నక్కా ఆనంద్ బాబు

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, వారి కుమారుడు రాజేషన్ ను అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడాన్నితీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పిరికిపంత, నీతిమాలిన చర్య. జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే అయ్యన్నపాత్రుడును అక్రమంగా అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున అరెస్ట్ చేసిన విధానం చూస్తే.. మనం ఎక్కడ ఉన్నాం. మనం ఏమైనా తాలిబన్ల పాలనలో ఉన్నామా. వీరి దుశ్చర్యలు చూస్తే, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఇంత అనైతికమా అని బాధేస్తోంది. కోర్టులు చీవాట్లు పెట్టినా చీమకుట్టినట్లుగా కూడా లేదు. తప్పు మీద తప్పు చేస్తున్నారు. ప్రహరి గోడకు, సీఐడీకి ఏం సంబంధం? క్రైమ్ జరిగితే లోకల్ పోలీసులు ఉంటారు. ఇంతవరకు ఏ ఎఫ్ఐఆర్ ఉందో తెలియదు. అసలు ప్రజాస్వామ్యం ఉందా, ఇరిగేషన్ స్థలం ఆక్రమణకు గురికావడానికి, సీఐడీకి ఏం సంబంధం?

అయ్యన్నపాత్రుడు ఆరుసార్లు ఎమ్మెల్యే, ఎంపీ. వారి కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆనందం కోసం సీఐడీ పనిచేస్తోంది. సీఐడీ సునీల్ కుమారే అన్నింటికి కారణమని అందరూ చెబుతున్నారు. ఈ చర్యలను ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలి. హైదరాబాద్ లో చింతకాయల విజయ్ ఇంట్లోకి వెళ్లి చిన్నపిల్లలను కూడా బెదిరించారు. ఇంతకింతకు అందరూ అనుభవిస్తారు. దీనికి పర్యవసానాలు ఉంటాయి. అరెస్ట్ చేసిన తీరు చాలా జుగుప్సాకరం. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వీటన్నింటికి బాధ్యత వహిస్తారు. సీఐడీ డిపార్ట్ మెంట్ చిల్లర డిపార్ట్ మెంట్ గా మారింది.

Leave a Reply