బీసీ నాయకులంటే ఎందుకు జగన్ రెడ్డికి బీపీ

-విజయసాయిరెడ్డి భూదందాపై పోరాటం సాగిస్తున్న అయ్యన్నపై కక్షసాధింపు
-బాబాయ్ హత్యలో షర్మిల వాగ్మూలం అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అక్రమ అరెస్ట్ లు
-నకిలీ డాక్యుమెంట్ల విషయంలో ధర్మాన ప్రసాద్ రావును ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
– కాలవ శ్రీనివాసులు

రాష్ట్రంలో విధ్వంసకర పాలన చేస్తూ, మరో వైపు విధ్వేష రాజకీయాలకు తెరతీసి అనేక సార్లు ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను వేదిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఉత్తరాంధ్ర బీసీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వర్యులు అయ్యన్న పాత్రుడు అరెస్ట్ ను చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనిపిస్తుంది. ఆయనను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తీరు, వ్యవహరించిన విధానం చట్టవ్యతిరేకం. అయ్యన్న పాత్రుడుతో పాటు ఆయన కుమారుడు రాజేష్ ను అక్రమ అరెస్ట్ చేసి అనేక రకాలుగా కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ నాయకులంటే ఎందుకు జగన్ రెడ్డికి బీపీ. టీడీపీ బీసీ పార్టీగా ఉంటూ వెనకబడిన వర్గాలకు వెన్నుముకగా ఉంటున్నందున బీసీలను బయపెట్టి టీడీపీపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.

ఉత్తరాంద్రలో విజయసాయిరెడ్డి చేస్తున్న భూదందాపై పోరాటం సాగిస్తున్న అయ్యన్న, కుటుంబంపై కక్షపెంచుకొని అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కడప ఎంపీ సీట్ కోసం జరిగిందని స్వయంగా జగన్ రెడ్డి సోదరి షర్మిల వాగ్మూలం ఇచ్చింది. దోషులను రక్షిస్తున్న జగన్ రెడ్డి ఆ అంశం నుంచి పక్కదారి పట్టించేందుకు అక్రమ అరెస్ట్ లకు పాల్పడుతున్నారు. అరెస్ట్ లు, అక్రమంగా జైల్లో పెట్టడంతో బీసీలను అణచివేస్తామని జగన్ రెడ్డి భావించడం అవివేకం.

బీసీలపై జరుగుతున్న దాడులను ఎదుర్కునేందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు నాయకత్వంలో పోరాడేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాం. రుషికొండ అక్రమ తవ్వకాలపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సర్వే చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. పచ్చదనంతో విరాజిల్లుతున్న రుషికొండను నాశనం చేస్తున్నది జగన్ రెడ్డి కుటుంబం కాదా? వారి ఆశలను రుషికొండ బలవౌతుంది. రుషికొండ అయ్యన్న పోరాటం అలుపెరగనిది, అన్యన్యసామాన్యమైనది. రుషికొండపై జగన్ రెడ్డి ఎప్పుడైతే కన్నుపడిందో, అప్పటి నుంచి ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు, ముఖ్యంగా బీసీ నాయకులను ఇబ్బందలకు గురి చేశారు. గతంలో పల్లా శ్రీనివాస్, అచ్చెన్నాయుడు ఇప్పుడు అయ్యన్న పాత్రుడిపై అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారు. సీఐడీ ముసుగులో జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రజాస్వామ్య వాదులందరూ పోరాడాల్సిన సమయం వచ్చింది.

అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. నిజంగా నకిలీ డాక్యుమెంట్ల విషయంలో అరెస్ట్ చేస్తే రెవిన్యూ శాఖ మంత్రిని ధర్మాన ప్రసాద్ రావును అరెస్ట్ చేయాలి. డాక్యుమెంట్లు ఫోర్జరీ సృష్టించి విశాఖలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ భూములు కాజేశారని సిట్ స్పష్టం చేసినా అరెస్ట్ చేసే దమ్ము సీఐడీ, జగన్ రెడ్డికి ఉందా? సిట్ నివేదికపై ఎందుకు జగన్ రెడ్డి ఇంత వరకు చర్యలు తీసుకోలేదు? ఎంత మందిని అరెస్ట్ చేసినా తెలుగుదేశం ఒక్క ఇంచు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జగన్ రెడ్డి లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా మా రాజకీయ పోరాటం సాగిస్తూనే ఉంటాం. ఉత్తరాంధ్ర ను గంజాయి అక్రమ రవాణాకు దేశంలో టాప్ లో నిలబడేలా చేసింది జే గ్యాంగ్ కాదా? ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఆటవిక పాలనకు ప్రజలందరూ జగన్ రెడ్డి విశాఖకు రాకూడదని కోరుకుంటున్నారు.

Leave a Reply