– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం: ప్రధాన ప్రతిపక్ష నాయకుడి భద్రత పట్ల జగన్ సర్కార్ స్పందించిన తీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, ఆనాడు 307 పై తొందరగా చర్యలు తీసుకోమని చెప్పారు. ఈనాడు మా నాయకులు గవర్నర్ ని కలిస్తే డీజీపీకి చర్యలు తీసుకోమని చెప్తామంటున్నారు.
ఐదు రోజులైనా ఈనాటికీ చర్యలు లేవు… మీ యాటిట్యూడ్ పెట్టిన సెక్షన్లు నిందితులను సమర్ధించే విధంగా ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటిమీద దాడికొస్తే… నాయకత్వం వహించిన వాడు మంత్రైయ్యాడు. కేంద్ర పార్టీ కార్యాలయంపై విజయవాడ నుంచి దుండగులొచ్చి దాడి చేసిన వారిపై కేసులు లేదు. ఎఫ్.ఐ.ఆర్. లేదు ఇంతవరకు అరెస్ట్ లేకపోగా జగన్ రెడ్డి వారికి పార్టీ పదవులిచ్చాడు.
చంద్రబాబు సి.ఎస్.ఓకు రక్తం చిందితే, 324 బెయిల్ బుల్ సెక్షన్ కట్టారంటే పోలీస్ యంత్రాంగం పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇంత వరకు ముద్దాయిలను పట్టుకోలేదు. మీరు సమాాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? ప్రత్యేక్ష ఆందోళనకు సిద్ధం… వెనుకాడే పరిస్థతి లేదని జగన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా.