Suryaa.co.in

Business News National

అదానికి 15 వేల ఎకరాలు.. సెంట్రల్ యూనివర్సిటీ కి 100 ఎకరాలే

గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ(CUG) ని 2009 లో నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కిరాయి భవంతుల్లో క్లాస్ లు నిర్వహించేవారు. సొంత క్యాంపస్ ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కేటాయించాలని నాటి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ సీఎం(మోడీ) కి లేఖలు రాసినా స్పందన లేదు.

మోడీ ప్రధాని అయ్యాక ల్యాండ్ కేటాయించాలని కోరుతు ఫాకల్టీ, విద్యార్థులు ఆందోళన చేస్తే ఈ మధ్య ల్యాండ్ కేటాయించారు.సెంట్రల్ యూనివర్సిటీ చట్టం ప్రకారం కనీసం 200 నుంచి 500 ఎకరాల వరకు భూమిని కేటాయించాలి. కనీసం 226 ఎకరాలు కేటాయించాలని CUG కమిటీ రాష్ట్రానికి నివేదించింది.

కానీ భూ కొరత సాకు చూపి కేవలం వంద ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే… కేంద్ర ప్రభుత్వం అంగీకరించి గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటి కి ఆ వంద ఎకరాలను బదలాయించింది. వంద ఎకరాల్లో సెంట్రల్ యూనివర్సిటీ ని ఎలా సర్దుబాటు చేయాలని యూనివర్సిటీ పాలక మండలి గగ్గోలు పెడుతుంది.విశ్వ విద్యాలయానికి భూ కొరత సాకుగా చూపిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం.. మోడీ సీఎం గా ఉన్నావుడు గౌతమ్ అధానికి 15 వేల ఎకరాలను కారు చౌకగా కట్ట బెట్టింది. దాన్ని ఆయన ముక్కలుగా చేసి ఇతర పారిశ్రామిక వర్గాలకు అమ్ముకున్నాడు.

గుజరాత్ ప్రభుత్వ ప్రధాన్యత లో విద్య లేక పోవడం వల్లే.. గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ కి అతి తక్కువ భూమి కేటాయించారు అని విద్యార్థులు ఆరోపోస్తున్నారు. డబల్ ఇంజిన్ సర్కార్ ఉందా, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉందా అన్నది కాదు..ఉన్న ప్రభుత్వానికి మనసు ఉందా లేదా అన్నదే ముఖ్యం.

LEAVE A RESPONSE